మరికొద్దిరోజుల్లో ముగియనున్న క్రమంలో బిగ్‌బాస్ షో రక్తికట్టిస్తోంది. ఫైనల్‌కి సమయం దగ్గర పడుతున్న క్రమంలో బిగ్‌బాస్ యాజమాన్యం సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా హౌస్‌లో దెయ్యం వాయిస్ ఓవర్‌తో కంటెస్టెంట్స్‌కు టాస్కులు ఇస్తున్నారు. దీంతో ఆ దెయ్యం వాయిస్ ఓవర్ ఎవరిది అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ దెయ్యంను చూసి అరియానా భయపడి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక మిగతా కంటెస్టెంట్స్ మాత్రం ఎవరూ భయపడటం లేదు.
బిగ్‌బాస్-1లో కూడా ఇలాంటి టాస్కే ఒకటి పెట్టారు. అది సక్సెస్ కావడంతో ఇప్పుడు మళ్లీ ఆ టాస్కే పెట్టారు. ప్రస్తుతం బిగ్‌బాస్-4లో తన పేరు జలజ అని చెప్పిన దెయ్యం.. కంటెస్టెంట్స్‌ని పేరుతో పిలుస్తోంది. ఆ వాయిస్ హరితేజది అని చాలామంది అనుకుంటున్నారు. మరికొందరు సింగర్ గీతామాధురి వాయిస్ ఓవర్ అని చెబుతున్నారు.
వీటిపై తాజాగా హరితేజ, గీతామాధురిలు క్లారిటీ ఇచ్చారు. దెయ్యం వాయిస్ ఓవర్ తమది కాదని హరితేజ, గీతామాధురి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వాయిస్ సింగర్ సుజీతది అయి ఉంటుందని కొంతమంది అభిప్రాయప