ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ చేతుల మీదగా ‘వెడ్డింగ్ డైరీస్’ ట్రైలర్ లాంచ్

ఎమ్ వి ఆర్ స్టూడియోస్ పతాకం పై డాక్టర్ మిద్దె విజయవాణి సమర్పణలో వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా “వెడ్డింగ్ డైరీస్”. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చాందిని తమిలారసన్ హీరో హీరోయిన్ గా నటించిన కుటుంబ కథా చిత్రం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 23న విడుదల అవుతుంది. అయితే ఈ చిత్రంలోని ట్రైలర్ ను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ గారు వీక్షించి విడుదల చేశారు.

ఈ సందర్భంగా చంద్రబోస్ గారు మాట్లాడుతూ “వెడ్డింగ్ డైరీస్ చిత్ర ట్రైలర్ ను చూసాను. చాలా ఆసక్తికరంగా ఉంది. పెళ్లి తర్వాత వచ్చే అపార్ధాలు అపోహలు వస్తూ పోతూ ఉంటాయి కానీ శాశ్వతం కాదు. శాశ్వతం గా ఉండేది వైవాహిక బంధం మాత్రమే అనే మంచి కథ తో ఈ వెడ్డింగ్ డైరీస్ చిత్రం తో మన ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను. హీరో గా నటించిన అర్జున్ అంబటి టాలెంట్ ఉన్న నటుడు అలాగే హీరోయిన్ చాందిని తమిలారసన్ గారికి దర్శకుడు వెంకటరమణ మిద్దె గారికి నా శుభాకాంక్షలు. అలాగే సంగీత దర్శకుడు మదిన్ ఎస్ కె మంచి పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం లో పని చేసిన అందరికి నా శుభాకాంక్షలు. ఆగస్టు 23న విడుదల అవుతుంది. అందరు చూసి ఈ చిత్రానికి మంచి విజయం అందించాలి” అని కోరుకున్నారు.

హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ “ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చంద్ర బోస్ గారు మా చిత్ర ట్రైలర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. మా వెడ్డింగ్ డైరీస్ చిత్రం ఆగస్టు 23న విడుదల అవుతుంది. మంచి కుటుంబ కథ చిత్రం. ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడాల్సిన చిత్రం” అని తెలిపారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత వెంకటరమణ మిద్దె మాట్లాడుతూ “వివాహిత జీవితంలో వాళ్ళకి ఎదురైయే ఇబ్బందులు మరియు సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో చూపిస్తుంది. రోజూ జరిగే గొడవలు, విభేదాలతో విసిగి వారు విడిపోవాలని నిర్ణయిస్తారు. కానీ, తర్వాత ప్రేమను, తమ బంధాన్ని ఎంత విలువైనదో గుర్తించి మళ్లీ కలుసుకుని, పెళ్లిని పునర్ నిర్మించుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ చిత్రం ప్రేమ మరియు దీర్ఘకాలిక సంబంధాలపై ఉన్న విలువలను వివరిస్తుంది. ఆగస్టు 23 న మహా మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.

అర్జున్ అంబటి, చాందిని తమిళరసన్, చమ్మక్ చంద్ర, మేక రామకృష్ణ, రవి తేజ లు నటించిన ఈ సినిమా కి మదిన్ ఎస్.కే సంగీతం అందించారు.