
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే (మే 20) సందర్భంగా ‘వార్ 2’ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ బర్త్ డేకి మరిచిపోలేని గిఫ్ట్ ఇస్తానని హృతిక్ రోషన్ కొన్ని రోజుల క్రితం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక దానికి తగ్గట్టే కాసేపటి క్రితం ‘వార్ 2’ టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌లోని డైలాగ్స్, విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లను చూసి సినిమా ప్రేమికులంతా ఆశ్చర్యపోతోన్నారు.
‘నా కళ్లు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయి కబీర్.. ఇండియాలో బెస్ట్ సోల్జర్, రా లో బెస్ట్ ఏజెంట్.. నువ్వే.. కానీ ఇప్పుడు కాదు.. నీకు నా గురించి తెలీదు.. ఇప్పుడు తెలుసుకుంటావ్.. గెట్ రెడీ ఫర్ వార్’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ టీజర్‌కు హైలెట్‌గా నిలిచాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ అదిరిపోయే స్క్రీన్ ప్రజెన్స్‌తో పాటుగా ఈ ఇద్దరూ కలిసి చేసే పోరాటలు సినిమాను చూసే ప్రేక్షకులకు అడ్రినల్ రష్ను కలిగించేలా ఉన్నాయి. ఈ ఇద్దరూ ఢీ అంటే ఢీ అనేలా పోరాట సన్నివేశాల్ని చేశారని టీజర్ చూస్తేనే అర్థం అవుతోంది.
చేజింగ్ సీన్లు, భారీ యాక్షన్ స్టంట్స్‌ను ఈ వార్ 2లో ఇండియన్ ఆడియెన్స్ చూడబోతోన్నారు. ఇక హృతిక్ రోషన్ సరసన కియారా అద్వానీ నటించారని ఈ టీజర్ చూస్తేనే అర్థం అవుతోంది. ఇక ఆమె అందాలు, బికినీలో కనిపించిన తీరుకు ఆడియెన్స్ అవాక్కవ్వడం ఖాయమనిపిస్తోంది. వార్ 2లో ఎన్టీఆర్ న్యూ లుక్, స్టైలీష్ యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రం అభిమానులకు ట్రీట్ ఇచ్చేలా ఉన్నాయి.
బ్లాక్బస్టర్లను అందించే YRF స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో వార్ 2 ఆరవ చిత్రంగా రాబోతోన్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం & తెలుగులో విడుదల కానుంది.