సాధారణంగా తెలుగులో ప్రతివారం సుమారు 5 నుండి 7 సినిమాలు విడుదలవుతాయి. వాటిలో ఎక్కువగా చిన్న సినిమాలు ఉంటాయి. చిన్న సినిమాలైనప్పటికీ అందరికీ తెలిసేలా ప్రమోషన్ జరుగుతుందంటే దానికి కారణం ఆ సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నవారే. అయితే అలా చిన్న సినిమాలను వెంకటేష్ చేయడంలో ముందుగా మనకు కనిపించేది మాస్ కా దాస్ విశ్వక్ సేన్. చిన్న సినిమాలతో పరిచయమై తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు విశ్వక్ సేన్. అయితే తాను ఎంత పెద్ద స్థాయికి వెళ్లినప్పటికీ చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడం మాత్రం ఆపలేదు. అలాగే ఈ వారం నీ బర్త్ డే బాయ్, కమిటీ కుర్రాళ్ళు, ఆపరేషన్ రావణ్, డార్లింగ్ వంటి సినిమాలో ప్రమోషన్లకు విశ్వక్ సేన్ కేర్ ఆఫ్ ప్రమోషన్ గా నిలిచారు. ఇటువంటి ఎన్నో చిన్న సినిమాలకు విశ్వక్సేన్ టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమాలలో పాల్గొంటూ తనకు వీలు కుదిరినంతగా ప్రమోట్ చేస్తూ ఆ సినిమాలు మార్కెట్లోకి ప్రేక్షకుల వద్దకు చేరుకునేలా విశ్వక్ సేన్ సహాయపడుతున్నారు.