విశ్వక్ సేన్ కొత్త సినిమా అప్డేట్

SLV సినిమాస్ నిర్మాణ సంస్థలో రానున్న 8వ సినిమా రాబోతుంది. శ్రీధర్ గంట రచన, దర్శకత్వం జరగనున్నారు. మాస్ క దాస్ విశ్వక్ సేన్ హీరోగా రాబోతున్న ఈ సినిమా సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ఈ సినిమా అప్డేట్ లో సినిమా నిర్మాణ సంస్ధ ఒక హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా అని తెలపడం జరిగింది. విశ్వక్ సేన్ యాక్షన్ సినిమాలు ఇప్పటికే చేయడం జరిగింది.

ఇక పోస్టర్ విషయానికి వస్తె విశ్వక్ సేన్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ లా కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే సినిమా టీం రిలీజ్ చేసిన పోస్టర్లో ‘ఎవ్రీ యాక్షన్ ఫైర్స్ ఎ రియాక్షన్’ అనే ఒక క్యాప్షన్ కూడా మనం చూడవచ్చు. సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు రావాల్సి ఉంది.