తెలుగులో విడుదలకు సిద్ధం అవుతున్న విశాల్ అయోగ్య

Vishal’s Ayogya

హీరో విశాల్ లేటెస్ట్ త‌మిళ చిత్రం అయోగ్య. త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో కూడాఅయోగ్య‌ అనే టైటిల్‌తోనే విడుద‌ల చేస్తున్నారు. తెలుగు నిర్మాత ఠాగూర్ మ‌ధు తొలిసారి త‌మిళంలో నిర్మించిన చిత్ర‌మిది. తొలి సినిమాతో ఠాగూర్ మ‌ధు నిర్మాత‌గా భారీ విజ‌యాన్ని అందుకున్నారు. ఈ చిత్రం తెలుగు హ‌క్కుల‌ను మ‌ల్కాపురం శివ‌కుమార్ సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం అనువాద కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జూన్‌లో సినిమాను విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు. రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. ఠాగూర్ మ‌ధు నిర్మంచిన ఈ చిత్రాన్ని వెంక‌ట్ మోహ‌న్ డైరెక్ట్ చేశారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించారు. హీరో విశాల్ న‌ట‌నే సినిమాకు హైలైట్‌గా నిల‌చిందని త‌మిళ ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు చిత్రాన్ని అప్రిషియేట్ చేశారు.

న‌టీన‌టులు:
విశాల్
రాశీఖ‌న్నా
పార్థిబ‌న్‌
సంతాన భార‌తి
ఎం.ఎస్‌.భాస్క‌ర్‌
యోగిబాబు
ఆనంద్ రాజ్‌
సోనియా అగ‌ర్వాల్

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ మోహ‌న్‌
నిర్మాత‌: మ‌ల్కాపురం శివ‌కుమార్‌
బ్యాన‌ర్: సుర‌క్ష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ లిమిటెడ్‌
సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్‌
మ్యూజిక్‌: సామ్ సి.ఎస్‌
డైలాగ్స్‌: రాజేష్ ఎ.మూర్తి
డ్యాన్స్‌: శోభి, భాస్క‌ర్‌
స్టంట్స్‌: రామ్ ల‌క్ష్మ‌ణ్‌
వి.ఎఫ్‌.ఎక్స్‌: సెల్వ‌కుమార్‌
ఎడిట‌ర్‌: రూబెన్‌
పాట‌లు: రాజ‌శ్రీ సుధాక‌ర్‌
ఆర్ట్‌: మూర్తి ఎస్.ఎస్‌