విరాట్ కోహ్లీని డామినేట్ చేసిన అనుష్క

ప్రపంచ వ్యాప్తంగా టాప్ మోస్ట్ సెలబ్రెటీ కపుల్స్ గా క్రేజ్ అందుకుంటున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒక సరికొత్త టాస్క్ తో అభిమానులను ఆకర్షించారు. విరుష్క అని లవ్లీ ట్యాగ్ సెట్ చేసుకున్న ఈ జంట ఇన్స్టాగ్రామ్ లో మొదటిసారి ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. టేక్ ఎ బ్రేక్ అనే ఆ కాన్సెప్ట్ లో అనుష్క సినిమాల గురించి అడుగగా.. విరాట్ క్రికెట్ గురించి అనుష్కను ప్రశ్నించాడు.

మొదటి హిందీ సినిమా ఏది.. క్రికెట్ లో ప్రాథమిక నిబంధనలు ఏమిటని? అంటూ ఒకరినొకరు అనేక రకాల ప్రశ్నలు సంధించుకున్నారు. ఇక ఈ పోటీలో ఎక్కువగా అనుష్క విరాట్ ని డామినేట్ చేసింది. వేరు వేరు రంగాలకు చెందిన ఇద్దరు టాప్ మోస్ట్ సెలబ్రెటీస్ వారి ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనే పాయింట్ ఆడియెన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా అనుష్క, విరాట్ మధ్యన ఉన్న ఆప్యాయత, లవ్.. వారి హావభావల్లో చాలా క్లియర్ గా కనిపించింది. విరుష్క జోడి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే బెస్ట్ లవ్ బర్డ్స్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.