RX100 దర్శకుడికి కరోనా పాజిటివ్

బండ్ల గణేష్, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో పాటు రాజమౌళి, డీవీవీ దానయ్య అలాగే ఇతర టీవీ ఆర్టిస్ట్ లు కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో సినీ ప్రముఖుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆర్ఎక్స్ 100 సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న అజయ్ భూపతి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది.

ఇక ఈ విషయం కొందరిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న సమయంలో నిజమేనని ఆ యువ దర్శకుడు చెప్పాడు. త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా.. అంటూ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ఇక దర్శకుడు రాజమౌళి కూడా కరోనా నుంచి పూర్తిగా కొలుకున్నట్లు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన కూడా త్వరలోనే ప్లాస్మా డోనేషన్ కి రెడీ అవుతున్నట్లు తెలియజేశారు.