Vijaysethupathi: ఏంట్రా మ‌న ఖ‌ర్మ అంటూ విజ‌య్‌సేతుప‌తి పాట‌..

Vijaysethupathi: విజ‌య్‌సేతుప‌తి, జ‌య‌రాం ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌ల‌యాళ చిత్రాన్ని తెలుగులో రేడియో మాధ‌వ‌న్ గా తెర‌కెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఏంట్రా మ‌న ఖ‌ర్మా అంటూ సాగుతున్న సాంగ్‌లో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ త‌నదైన స్టైల్లో డ్యాన్స్ వేస్తూ.. ఎంతో ఆక‌ట్టుకుంటుంది. తెలుగులో Vijaysethupathi విజ‌య్‌సేతుప‌తికి మంచి మార్కెట్ ఉంది.. తాజాగా ఆయ‌న న‌టించిన ఉప్పెన చిత్రంలో విల‌న్ పాత్ర వేసి ప్రేక్ష‌కుల మ‌న‌స్సును గెలుచుకున్నాడు.

vijaysethupathi new movie

దీంతో Vijaysethupathi ఆయ‌న‌కు భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇక అలాగే ఈ చిత్రంలో న‌టించిన మ‌రో హీరో జ‌య‌రాం.. ఆయ‌న న‌టించిన తెలుగు సినిమాలు భాగ‌మ‌తి, అల వైకుంఠ‌పురం విజ‌యం ద‌క్క‌గా.. ఆయ‌న‌కు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు వ‌చ్చింది. ఇక వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న రేడియో మాధ‌వ‌న్ చిత్రాన్ని సనీల్ క‌లాథిల్ ద‌ర్శ‌క‌త్వంలో, ల‌క్ష్మీ చెన్న‌కేశ‌వ ఫిల్మ్స్ ప‌తాకంపై తెలుగు ప్రేక్ష‌కుల‌కు తీసుకువ‌స్తున్నారు. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చిత్ర నిర్మాత‌లు పేర్కొన్నారు.