


”విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ తీసుకోవడం చాలా సంతోషంగా వుంది. కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల గారు ఆడపులి. వారి పేరు మీద ఈ అవార్డ్ ని తీసుకోవడం గర్వంగా ఫీలౌతున్నాను’అన్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. శ్రుతిలయ సీల్ వెల్ కార్పోరేషన్- కళాకారుల ఐక్యవేదిక సమక్షంలో ప్రముఖ నటీమణి, దర్శకురాలు విజయనిర్మల గారి జయంతి సందద్భంగా ప్రముఖ రచయిత దర్శకులు జంధ్యాల గారి 75 సం.ల వజ్రోత్సవ సంచిక ఆవిష్కరణ తో పాటు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ 2025ని బహుకరించారు. నవరసరాయ డాక్టర్ నరేష్ వికె సమక్షంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర శానన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిధిగా జహారయ్యారు. హీరో మంచు విష్ణు, శివబాలాజీ, పవిత్ర లోకేష్, జంధ్యాల అన్నపూర్ణ, శ్రీలక్ష్మీ, ప్రదీప్, సాయినాథ్ తో పాటు అనేక మంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనారు.
విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ గ్రహీత డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సభకు నమస్కారం. జంధ్యాల గారి పుస్తక ఆవిష్కరణలో పాల్గోవడం చాలా ఆనందంగా వుంది. అలాగే నేను విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ తీసుకోవడం చాలా సంతోషంగా వుంది. కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల గారు ఆడపులి. అత్యధిక సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా రికార్డ్ సృష్టించారు. వారి పేరు మీద ఈ అవార్డ్ ని తీసుకోవడం గర్వంగా ఫీలౌతున్నాను. ఇలాంటి అవార్డ్ నాకు అందించిన నరేష్ గారు ధన్యవాదాలు. నరేష్ గారు గ్రేట్ సన్, వారి అమ్మగారి పేరు మీద ఈ అవార్డ్ ని కొనసాగించడం చాలా ఆనందంగా వుంది. జంధ్యాల గారికి నేను ఏకలవ్య శిష్యుడిని. ఆయన సినిమాలు చూస్తూ కామెడీ టైమింగ్ నేర్చుకున్నాను. ఈ రోజు నేను కామెడీ పండిస్తున్నానంటే ఆ క్రెడిట్ జంధ్యాల గారికి దక్కుతుంది. నవ్వు ద్వారా ప్రజలు దగ్గరైనందుకు గర్వంగా ఫీలౌతున్నాను. వరుస హిట్స్ కొడుతున్నాను. ఇంకా పీక్స్ రాలేదని భావిస్తున్న తరుణంలో 2025 లో సంక్రాంతి వస్తున్నాం లాంటి ఓ హాస్య ప్రధానమైన సినిమాతో దేవుడు ఓ అద్భుతమైన సినిమా ఇచ్చాడు. నరేష్ గారు గ్రేట్ పర్శన్. ఆయనతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేయడం ఆనందంగా వుంది. మళ్ళీ ఆయనతో కలసి పని చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ’అన్నారు.


నవరసరాయ డాక్టర్ నరేష్ వికే మాట్లాడుతూ.. సభకు నమస్కారం. ఒక ఆలయానికి ద్వజస్థంభం వుంటుంది. అది సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన నా జీవితానికి దేవుడు. నాకు ఇద్దరు గురువులు.. అమ్మ విజయనిర్మల గారు, జంధ్యాల గారు. లవ్ స్టొరీ రైట్స్ తీసుకొని నాతో సినిమా చేయాలని అమ్మ, కృష్ణ గారు భావిస్తుంటే.. జుంధ్యాల గారు నరేష్ ని నాకు ఇవ్వండని అడిగితే వాళ్ళ సినిమాని పక్కన పెట్టి నన్ను జంధ్యాల గారి చేతిలో పెట్టారు. అది వారికి జంధ్యాల గారిపై వున్న నమ్మకం. మేము మద్రాస్ లో వుండేవాళ్ళం. తెలుగు ఒత్తులు సరిగ్గా పలికేవి కావు. జంధ్యాల గారు డబ్బింగ్ చూసి అమ్మగారితో చాలా అందంగా ఓ మాట చెప్పారు. నరేష్ డబ్బింగ్ చెబితే పది సినిమాలు వస్తాయి. బాలు గారు డబ్బింగ్ చెబితే పది కాలాల పాటు ఉంటాడు అన్నారు. కేవలం నటన నేర్పించడమే కాదు భాష ని నేర్పించిన గురువు జంధ్యాల గారు. జంధ్య్యాల గారు విజయ నిర్మల గారు నా కెరీర్ ఓ పదేళ్ళు ముందుకు తీసుకెళ్ళి ఎన్నో మరపురాని సినిమాలు అందించి ఒక స్టార్ డమ్ ని తీసుకొచ్చారు. వజ్రోత్సవం అన్నప్పుడు రెండేళ్ళుగా ఓ ఆలోచన చేశాం. జంధ్యాల గారిపై ఓ పుస్తకం రాయాలని భావించాం. రచయిత సాయినాథ్ తోటపల్లి గారు ఆ భాద్యత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ పుస్తకం కోసం అనేక మైళ్ళు తిరిగి 40మంది ప్రముఖులని ఇంటర్వ్యూ చేసి ఈ పుస్తకాన్ని తయారు చేశారు. వయసు రిత్యా ఇది జంధ్యాల గారి వజ్రోత్సవం. రచయితగా 50 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఇది అద్భుతమైన సందర్భం. జంధ్యాల గారి వజ్రోత్సవ సంచిక పుస్తకం ఆవిష్కరణ, 46 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలు అమ్మ విజయ నిర్మల గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా వుంది. ఎవరికీ సినిమా అవకాశం అడగొద్దు. అది వచ్చినప్పుడు వస్తుందనే జంధ్యాల గారి మాటని నేను వేదంలా పాటించాను. అయితే అనిల్ రావిపూడిని మనం ఎందుకు కలసి సినిమా చేయకూడదని అడిగాను. హాస్యం పాదరం లాంటింది. హాస్య పండించే సత్తా వున్న దర్శకులు వందలో ఒకరో ఇద్దరో వుంటారు. ఈ తరంలో అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడికి విజయకృష్ణ సిల్వర్ క్రౌన్ 2025 అవార్డు పురస్కారం అందజేయడం చాలా సంతోషంగా వుంది. సంక్రాంతికి వస్తున్నాం మేము కలసి చేసిన మొదటి సినిమా కావడం నా అదృష్టం. అనిల్ ని చూస్తే జంధ్యాల గారు గుర్తుకు వస్తారు. అలాగే నందిని రెడ్డి గారిని చూసినపుడు అమ్మ గుర్తుకువస్తారు. అమ్మ బర్త్ డే తో పాటు పవిత్ర బర్త్ డే కూడా ఈ రోజు రావడం ఆనందంగా వుంది. ఇవన్నీ కలిపి ఓ వేడుకలా జరుపుకోవడం ఆనందంగా వుంది. ఈ వేడుకకు వచ్చిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు.
తెలంగాణా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రముఖ సినీ నటి దర్శకురాలు స్వర్గీయ విజయనిర్మల గారి జయంతి సందర్భంగా యువ రచయిత దర్శకులు అనిల్ రావిపూడి గారికి విజయకృష్ణ సిల్వర్ క్రౌన్ 2025 అవార్డుని పురస్కారం అందజేయడం చాలా సంతోషం. అవార్డు అందుకుంటున్న అనిల్ రావిపూడి గారికి నా శుభాకాంక్షలు. అదేవిధంగా స్వర్గీయ జంధ్యాల గారి 75వ జయంతి సందర్భంగా వజ్రోత్సవ సంచికని నా చేతుల మీదగా ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నాను. సినీ కళామతల్లికి సేవ చేసిన ఇద్దరు ప్రముఖుల సేవలను గుర్తు చేసుకుని వేడుకను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు నా అభినందనలు. విజయనిర్మల గారు 200 సినిమాల్లో నటించడమే కాకుండా 44 సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించడం వారి ప్రతిభకు నిదర్శనం. వారు తెలుగు బిడ్డ కావడం మన తెలుగుజాతికి గర్వకారణం, ఆదర్శం. మరో గొప్ప దర్శకుడు జంధ్యాల గారు తన సినిమాల్లో అందరినీ నవ్వించిన హాస్యబ్రహ్మ. ఎన్ని బాధలు ఉన్నా కాసేపు జంధ్యాల గారి సినిమాలు చూస్తే అన్ని మర్చిపోయి హాయిగా నవ్వుకుంటారు. జబ్బులు నయం చేసేది మందులు అయితే మనసులో బాధని నయం చేసేది హాస్యం. హాస్యాన్ని తెరపై పండించడంలో జంధ్యాల గారిది తిరుగులేని చెయ్యి. తెలుగు సినిమా ఉన్నంతకాలం విజయనిర్మల గారిని జంధ్యాల గారిని తెలుగు ప్రేక్షకులు మర్చిపోరు. దర్శకుడు అనిల్ రావిపూడి గారికి మంచి భవిష్యత్తు ఉంది. విజయకృష్ణ అవార్డ్ అందుకోవడం అనిల్ రావిపూడి గారి అదృష్టంగా భావిస్తున్నాను. హైదరాబాద్ తో తెలుగు చిత్ర పరిశ్రమకు విడదీయరాని అనుబంధం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజా యుద్ధ నౌక స్వర్గీయ గద్దర్ గారి పేరు మీద సినిమా కళాకారులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు వారికి అండదండలు అందిస్తున్న పెద్దలకు నా ధన్యవాదాలు’అన్నారు


హీరో మంచు విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఎంత సాయం చేసినా కృతజ్ఞత లేని రోజుల్లో నరేష్ గారిని తలచుకుంటూ ఈ వేడుక జరగడం ఆనందంగా వుంది. ఇది మా తరం భావితరం నేర్చుకోవాల్సిన పద్దతి. పెద్దలని గుర్తుపెట్టుకొని గౌరవించుకోకపొతే భావితరానికి భవిష్యత్ కష్టం. అనిల్ రావిపూడి గారికి కంగ్రాట్స్. అందరికీ థాంక్ యూ’అన్నారు.
జంధ్యాల వజ్రోత్సవ సంచిక రచయిత సాయినాథ్ తోటపల్లి మాట్లాడుతూ.. జంధ్యాల గారు నాకు గురువు. నేను ఈ స్టేజ్ మీద ఉన్నానంటే కారణం ఆయనే. జంధ్యలా గారిని అమితంగా ప్రేమించే మనిషి మా నరేష్. నరేష్ లాంటి శిష్యుడు వుండటం జంధ్యాల గారి అదృష్టం. జంధ్యాల గారిపై నరేష్ ఆరాధనకు హ్యాట్సప్’అన్నారు.
యాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ.. జంధ్యాల గారు తెలుగు ఆస్తి. తెలుగు నవ్వు. జయహో జంధ్యాల. విద్య నేర్పించిన గురువు జంధ్యాల గారు. ఆయనని తెలుగు జాతి ఎప్పటికీ మర్చిపోదు. కృష్ణ గారు నా అభిమాన హీరో. తెలుగు జాతి గర్వించే సినిమాలు తీసిన వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్. విజయ నిర్మల గారు నరేష్ కి అమ్మ అయితే నాకూ అమ్మే. ప్రపంచంలో ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన ఏకైక మహిళా దర్శకురాలు. అడవి తీసిన సినిమాలు అజరామరం. కృష్ణ గారు విజయ నిర్మల గారితో అవార్డ్ ని అనిల్ రావిపూడికి ఇవ్వడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. అపజయం లేని దర్శకుడు అనిల్. అనిల్ గారికి నేను పెట్టుకున్న ముద్దు పేరు యువ హాస్య బ్రహ్మ’అన్నారు.
నటి శ్రీలక్ష్మీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా అబ్బాయి నరేష్. వీరాంజనేయలు విహారయాత్రలో తను మా అబ్బాయిగా నటించినందుకు ఆనందంగా వుంది. ఈ వేడుకకు పిలిచినందుకు చాలా సంతోష పడుతున్నాను. విజయనిర్మల గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ దర్శకత్వంలో నేరము శిక్ష సినిమాలో నటించడం నా అదృష్టం. దాదాపు పదికి పైగా జంద్యాల గారి సినిమాలు చేశాను. ఎన్నో పాత్రలు మంచి పాత్రలు తీసుకొచ్చాయి. ఆయన వలన మీ అందరి ఆదర అభిమానులు పొందాను. ఆయన కామెడీ చిరస్థాయిగా నిలిచింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన నరేష్ గారికి ధన్యవాదాలు’ అన్నారు
రచయిత సత్యానంద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. జంధ్యాల నాకు ఎంతో ఆప్తుడు. కలిసి ఎన్నో సినిమాలు చేశాం. అలాంటి జంధ్యాలకి మా నరేష్ ఇంత గొప్ప కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఎపుడూ నవ్వుతూ నవ్వించే మనిషి జంధ్యాల. నేను ఎప్పుడైనా బాధపడ్డాను అంటే ఆయన లేరనితెలిసినప్పుడు. తర్వాత ఆయన ఎప్పుడు వున్నాడని ఆయన సినిమాలు చుసినపుడల్లా సంతోషంగా ఫీలౌతాను. తను ఎక్కడున్నా ఇక్కడ వునట్లే అనిపిస్తాడు. ఆయనని తలచుకుంటూ ముగిస్తున్నాను. థాంక్ యూ సో మచ్’అన్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.