విజయవాడ అమ్మాయి వీణా రావు టాలీవుడ్లో అరంగేట్రం చేయనున్నారు. YVS చౌదరి దర్శకత్వంలో స్వర్గీయ నందమూరి జానకిరామ్ తనయుడు తారక రామారావు హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీలో ఈమెను హీరోయిన్గా తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వీణా కూచిపూడి డ్యాన్సర్ కాగా ఆమె తెరంగేట్రంపై ఇటీవల ఒక వీడియో, ఫొటో షూట్ విడుదలైంది. ఆమె 18 నెలలుగా YVS వద్ద నటనలో శిక్షణ తీసుకున్నానని చెప్పారు.