అభిమానితోనే ఏడడుగులు వేసిన విజయ్.. ఆ ప్రేమకు 20ఏళ్ళు

కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యదిక మార్కెట్ ఉన్న స్టార్ హీరోలలో విజయ్ ఒకరు. రజినీకాంత్ కంటే హై లెవెల్లో తన మార్కెట్ ని పెంచుకుంటున్న విజయ్ కి అభిమానుల ఫాలోయింగ్ కూడా గట్టిగానే పెరుగుతోంది. ఇక ఆగస్ట్ 25వ తేదీన ఈ స్టార్ హీరో ప్రేమ పెళ్లికి 20 ఏళ్ళు కావడంతో అభిమానులు స్పెషల్ గా విషెస్ అంధించారు. వారికి సంబంధించిన ఫొటోలు బాగానే వైరల్ అయ్యాయి.

ఇక వారి లవ్ స్టొరీలోకి వెళితే.. విజయ్ భార్య సంగీత మొదటి నుంచి కూడా విజయ్ ఫ్యాన్. కుటుంబ సబ్యులతోనే లండన్ లోనే స్థిరపడిన సంగీత ఒకసారి విజయ్ ని చూడటానికి సొంత రాష్ట్రానికి తమిళనాడుకి వచ్చింది. విజయ్ ఆశ్చర్యపోయి ఆమెను భోజనానికి కూడా పిలిచాడు. అయితే సంగీత మొదటిసారి వచ్చినప్పుడే విజయ్ కుటుంబ సభ్యులకు కూడా బాగా నచ్చారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ వెంటనే నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మీ అమ్మా నాన్నలతో రావాలని కోరడంతో సంగీత కూడా ఇష్టంతోనే వచ్చింది. ఇక పరిచయమైన మూడేళ్ళలోనే వారి వివాహం జరిగింది. 1999లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు జేసన్‌ సంజయ్‌. కుమార్తె పేరు దివ్య శాషా.