హీరో కంటే విజయ్ సేతుపతికి ఎక్కువ రెమ్యూనరేషన్

హీరోగానే కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. ఇటీవల వచ్చిన మాస్టర్ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి నటన అందరినీ ఆకట్టుకుంది. దీంతో స్టార్ హీరోల సినిమాల్లో నటించాల్సిందిగా విజయ్ సేతుపతికి ఆఫర్స్ వస్తున్నాయి.

VIJAY SETUPATI REMUNARATION

ఈ క్రమంలో ఒక వెబ్‌సిరీస్‌లో నటించేందుకు విజయ్ సేతుపతి ఒకే చెప్పాడు. ఇందులో హీరో కంటే విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ ఎక్కువ కావడం గమనార్హం. ఇందులో కోలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటిస్తుండగా.. అతడికి రూ.40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక విజయ్ సేతుపతి రూ.55 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.