Anupama: రౌడీ లుక్‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌..

Anupama: ప్ర‌ముఖ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్రేమ‌మ్ చిత్రంతో మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది. ఈ సినిమా విజ‌యం అవ్వ‌డంతో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అ ఆలో నితిన్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం దొరికింది. ఈ సినిమాలో అనుప‌మ గ‌డుసు పిల్ల‌గా అద‌ర‌గొట్టిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత దిల్ రాజు నిర్మాణంలో శ‌ర్వానంద్ హీరోగా శ‌త‌మానం భ‌వ‌తి అనే చిత్రం ద్వారా తెలుగు తెర‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది Anupama.

ఈ చిత్రం ఉత్త‌మ చిత్రంగా నిలిచింది. అయితే ప్ర‌స్తుతం ఈ భామ కాస్త ప్లాపులో ఉంది. ప్ర‌స్తుతం అవ‌కాశాలు పెద్ద‌గా లేవు. దీంతో కాస్తా సోష‌ల్ మీడియాలో హాల్ చ‌ల్ చేస్తోంది. హాట్ ఫోటోల‌తో పాటు విభిన్నంగా ఫోటో షూట్ చేసుకుంటుంది. తాజాగా అనుప‌మ Anupama విభిన్నమైన ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో పొడ‌వాటి జుట్టుకు స‌గ్రం బ్రౌన్ క‌ల‌ర్ డై వేసుకుని స‌న్ గ్లాసెస్ లో లుక్ లో క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారుతుంది. దీంతో ఆ ఫోటోను చూసి రౌడీ లేడీ అంటూ నెటిజ‌న్ల్ కామెంట్స్ చేస్తున్నారు.