కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాలల్లోకి రాబోతున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం అభిమాన సంఘాల అధ్యక్షులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ ప్రతి గ్రామంలో ఒక సైన్యాన్ని ఏర్పటు చేస్తున్నట్లు కథనాలు కూడా వెలువడ్డాయి. ఇక ఇప్పుడు విజయ్ బీజేపీలోకి రానున్నట్లు రూమర్స్ ఎక్కువవ్వడంతో తండ్రి చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు.
ఇటీవల కుష్బును తెలివిగా పార్టీలోకి తెచ్చుకున్న బీజేపీ మరో స్టార్ హీరోపై కూడా ఫోకస్ పెట్టినట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇక ఫైనల్ గా విజయ్ అటు వైపు అడుగులు వేసే ఆలోచనలో ఉన్నారని రూమర్స్ రాగా విజయ్ తండ్రి చంద్రశేఖర్ వేంటనే స్పందించారు. విజయ్ భారత జనతా పార్టీలో కలుస్తున్నాడా? అనే విషయంపై గత వారం రోజులుగా నాకు అనేక రకాల ఫోన్లు వస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని మరోసారి చెబుతున్నాను. విజయ్ ప్రస్తుతం ఎలాంటి పార్టీలోను చేరడానికి సిద్ధంగా లేడని ఆయన చెప్పడంతో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం విజయ్ మాస్టర్ సినిమా విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే.