సాయి ధరమ్ తేజ్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన మెగాస్టార్

sai dharam tej marriage

టాలీవుడ్ బ్యాచిలర్ లైఫ్ తో ఇన్నాళ్లు సోలో బ్రతుకే సో బెటర్ అన్న చాలా మంది హీరోలు పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ని సరికొత్తగా స్టార్ట్ చేశారు. ఇక సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లికి సిద్ధమైనట్లు గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడి పుట్టినరోజు సందర్భంగా ఆ విషయంపై ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశారు.

నేడు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలోని అమృత సాంగ్ ని మెగాస్టార్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సాయికి విషెస్ అందిస్తూ.. ఈ సోలో బ్రతుకు ఇంకా కొన్ని రోజులే. హ్యాపీగా ఈ కొన్నిరోజులు బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చెయ్.. అంటూ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ఈ ట్వీట్ తో సాయి మరికొన్ని రోజుల్లో ఒక ఇంటివాడు కాబోతున్నట్లు అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక సాయి కూడా మామయ్య విషెస్ కి సంతోషిస్తూ ఇంతకంటే గొప్ప గిఫ్ట్ నాకు మరొకటి అవసరం లేదని స్పెషల్ గా కృతజ్ఞతలు తెలిపాడు.