నయనతార గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విగ్నేష్ శివన్

నయనతార, విగ్నేష్ శివన్… కోలీవుడ్ ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్. ఈ ఇద్దరి ఫోటోలు బయటకి వస్తే చాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా నానుమ్ రౌడీ దాన్ సినిమా రిలీజ్ అయ్యి నాలుగేళ్లు అయ్యింది. ఈ సందర్భంగా తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్న విగ్నేష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. నయన్‌.. నిన్ను కలిసిన తర్వాతే నా జీవితం ఎంతో మధురంగా మారింది. ‘నానుమ్‌ రౌడీదాన్‌’ సినిమాతో నాకు విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాలో నటించి.. నేనో మంచి జీవితాన్ని పొందే అవకాశాన్ని నాకు అందించావు. నువ్వు ఎప్పుడూ ఇలాగే అందంగా, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. లార్డ్‌ ఆఫ్‌ లవ్‌.’ అని విఘ్నేష్‌ పేర్కొన్నారు.

shivan nayan

‘నానుమ్‌ రౌడీదానే’ సినిమాని తెలుగు ‘నేను రౌడీనే’ పేరుతో 2016లో విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే విఘ్నేష్‌-నయన్‌ ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం నయన్‌ నటిస్తున్న నెట్రికన్‌ సినిమాకి విఘ్నేష్‌ శివన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.