మెగా నందమూరి హీరోలకి ఊహించని షాక్ ఇచ్చిన రౌడీ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ నటిస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఫీల్ గుడ్ సినిమాలు చేసే క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది. సిగరేట్ పట్టుకోని రగ్గడ్ లుక్ లో లవ్ ఫెయిల్యూర్ గా కనిపించిన దేవరకొండ నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడు. ఇదిలా ఉంటే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే నాడు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందుకు సంబందించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే లేట్ అనుకుంటున్న టైములో విజయ్ స్పీడ్ పెంచుతూ మెగా నందమూరి హీరోలకి షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

vijay devarkonda

వాలెంటైన్స్ డే నాడు రిలీజ్ చేయాలనుకున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాని స్పీడ్ అప్ చేసి ఈ డిసెంబర్ లోనే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ మరింత వేగవంతం చేసి డిసెంబర్ 20వ తేదీనే చిత్రాన్ని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. అదే రోజున సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ప్రతి రోజు పండగే విడుదల కానుంది. దీనితోపాటు బాలకృష్ణ రూలర్ కూడా ఇదే వారంలో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. వరల్డ్ ఫేమస్ లవర్ డిసెంబర్ 20కి రావడం ఖాయం అయితే మాత్రం ఈ రెండు సినిమాలకి విజయ్ దేవరకొండ నుంచి ఊహించని పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.