మరో సారి అభిమానులని నిరాశ పరచనున్న వెంకీ మామ

నారప్ప… అమెజాన్ ప్రైం లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్స్ లో విడుదల కావాల్సిన ఈ మూవీ, ఒటిటిలో రిలీజ్ అయ్యి అభిమానులని నిరాశ పరిచింది. నారప్ప మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే కలెక్షన్స్ పరంగా మంచి మార్కెట్ సొంతం చేసుకునేది. ఇప్పుడు వెంకటేష్ తన మరో సినిమాతో అటు అభిమానులని, ఇటు మార్కెట్ ని ఇబ్బంది పెట్టే పని చేయబోతున్నాడు. వెంకీ నెక్స్ట్ సినిమా దృశ్యం 2 కూడా ప్రముఖ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ ఢీల్ కూడా కంప్లీట్ అయిందని తాజా సమాచారం. మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాకి సీక్వెల్‌గా దృశ్యం 2 రూపొందించారు. ఇందులో కూడా వెంకీ జంటగా సీనియర్ హీరోయిన్ మీనా నటించారు. ఇప్పటికే అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకోని ఈ మూవీ రిలీజ్‌కి రెడీగా ఉంది. దృశ్యం 2ని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది సాధ్యపడలేదు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో దృశ్యం 2 విడుదల చేసేందుకు నిర్మాతలకి మంచి ఢీల్ కుదిరింది. సెప్టెంబర్‌లో దృశ్యం 2 సినిమా రిలీజ్ కి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. మలయాళ దృశ్యం 2 కూడా థియేటర్స్ లో విడుదల కాకుండా ఒటిటిలోనే రిలీజ్ అయ్యింది.