వరుణ్ తేజ్‌ తో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్..

మిల్కీ బ్యూటీ తమన్నా స్టార్ హీరోయిన్‌గా అటు తమిళం, ఇటు తెలుగు సినిమాలలో నటిస్తూనే స్పెషల్ సాంగ్స్‌లో కూడా స్టార్ హీరోలతో అదరగొడుతోంది. ఇప్పటికే ఈ మిల్కీ బ్యూటీ బెల్లంకొండ శ్రీను, జూనియర్ ఎన్.టి.ఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. తమన్నాచేసిన స్పెషల్ సాంగ్స్ మంచి క్రేజ్ ని తీసుకు వచ్చాయి. ప్రేక్షకుల్లో కూడా తమన్నా స్పెషల్ సాంగ్స్ కి బాగా పాపులారిటీ వస్తోంది. దాంతో మెకర్స్ కూడా తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయించడానికి భారీ మొత్తాన్నే ఆఫర్ చేస్తున్నారు.

అలాంటి ఆఫర్ తమన్నాకి మరొకటి వచ్చినట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రం గని. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు వెంకటేశ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అంతేకాదు మొదటిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ.. రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు సమాచారం.

కాగా ఇందులో మంచి మాస్ సాంగ్ ఒకటి మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ మాస్ సాంగ్‌లో వరుణ్ తేజ్‌తో తమన్నా భాటియా ఆడిపాడనుంది. త్వరలో ఈ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించనున్నారట. అంతేకాదు సినిమాలో ఈ సాంగ్ చాలా హైలెట్ గా నిలిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. బాక్సర్ గా వరుణ్ తేజ్ నటిస్తుండగా ఇందులో కొత్త మేకోవర్ తో కనిపించనున్నాడు. ఇప్పటికే గని మూవీ నుంచి విడుదలైన వరుణ్ తేజ్ లుక్ మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. చూడాలి మరి తమన్నా స్పెషల్ సాంగ్ గని సినిమాకి ఎంత ప్లస్ అవుతుందో.