గతేడాది సినీ ఇండస్ట్రీ ఎంతో మంది ప్రముఖులని కోల్పోయింది. ఈ ఏడాది కూడా కరోనా మరియు ఇతర కారణాలతో ఎంతో మంది మరణించారు. ఈ విషయంలో బాలీవుడ్ కి మరో భారీ దెబ్బ తగిలింది. ‘హమ్ ఆప్కే హై కౌన్’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన లక్ష్మణ్ (78) తుదిశ్వాస విడిచారు. నాగ్‌పూర్‌లో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు గుండె పోటు కారణంగా చనిపోయినట్లు ఆయన కుమారుడు అమర్ తెలిపారు. ఇటీవలే రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న లక్ష్మణ్ గారు… అప్పటి నుంచి చాలా నీరసంగా, బలహీనంగా కనిపించారని అమర్ తెలిపాడు.
1942 సెప్టెంబర్ 16న జన్మించిన లక్ష్మణ్ అసలు పేరు విజయ్ పాటిల్. ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కుంటున్న సమయంలో సోదరుడు సురేంద్ర పాటిల్‌తో కలిసి ఇద్దరూ రామ్‌లక్ష్మణ్‌గా పేర్లు మార్చుకున్నారు. ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘హమ్ సాథ్ సాథ్ హై’, ఈ ఇద్దరూ కలిసి సంగీతాన్ని అందించగా, ‘ఏజెంట్ వినోద్’ (1976) సినిమాకు సంగీతం ఇచ్చిన తర్వాత సురేంద్ర పాటిల్ అనారోగ్యంతో మరణించారు. అప్పటినుంచి విజయ్ పాటిల్ ఒక్కడే రామ్ లక్ష్మణ్ పేరుతో తన సంగీత ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. సూరజ్ బర్జాత్యా తీసిన ‘మైనే ప్యార్ కియా’ సినిమా పాటలకుగాను విజయ్ పాటిల్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్‌గా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. 1999 లో వచ్చిన వీ ఆర్ టుగెదర్ ఆయన చివరి సినిమా.