ఆహా ఓటీటీ ఒరిజినల్స్ గా స్ట్రీమింగ్ కు రాబోతోంది “వేరే లెవెల్ ఆఫీస్” వెబ్ సిరీస్. ఈ సిరీస్ ను వరుణ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వరుణ్ చౌదరి గోగినేని నిర్మిస్తున్నారు. ఇ సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ జే కాజల్, అఖిల్ సార్థక్, శుభశ్రీ, మిర్చి కిరణ్, రీతు చౌదరి, స్వాతి చౌదరి, వసంతిక, మహేశ్ విట్టా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సిరీస్ ట్రైలర్ ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో
నటుడు అఖిల్ సార్థక్ మాట్లాడుతూ – బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాను. నాలుగేళ్లుగా ఇలాంటి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. వేరే లెవల్ ఆఫీస్ స్క్రిప్ట్ వినగానే నాకు పర్పెక్ట్ స్క్రిప్ట్ అనిపించింది. మా టీమ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఈ సిరీస్ లో నటించాం. ఒక మంచి సిరీస్ తో మీ ముందుకు రాబోతున్నాం. డిసెంబర్ 12నుంచి ఆహాలో వేరే లెవెల్ ఆఫీస్ చూడండి. అన్నారు.
నటి శుభశ్రీ మాట్లాడుతూ – ఫ్రెండ్స్ వెబ్ సిరీస్ నా ఫేవరేట్ వెబ్ సిరీస్. అలాంటి ఒక సిరీస్ లో నటించే అవకాశం వస్తే బాగుండేది అని అనిపించేది. ఆ క్రమంలో నాకు వేరే లెవెల్ ఆఫర్ వచ్చింది. స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. 50 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ రాబోతోంది. మేమంతా సందడిగా షూటింగ్ చేశాం. ఇలాంటి సిరీస్ ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పగలను. అన్నారు.
నటుడు మిర్చి కిరణ్ మాట్లాడుతూ – పదేళ్లు రేడియోలో వర్క్ చేశాక..సినిమాల్లోకి వచ్చాను. ఇక్కడ షూటింగ్స్, యాక్టింగ్, కొన్నిసార్లు స్క్రిప్ట్ రైటింగ్ చేశాను. అయితే ఈ బిజీ షెడ్యూల్స్ వల్ల ఆఫీస్ వాతావరణం మిస్ అయినట్లు భావించా. అలాంటి టైమ్ లో వేరే లెవెల్ ఆఫీస్ ఆఫర్ వచ్చింది. దాంతో మళ్లీ 9 టు 5 ఆఫీస్ కు వెళ్లిన ఫీల్ కలిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆహాకు థ్యాంక్స్. అన్నారు.
నటి స్వాతి చౌదరి మాట్లాడుతూ – ఆహాలో నేను చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. నా క్యారెక్టర్ ఫుల్ మాస్ గా ఉంటుంది. మంచి ఫుడ్ లవర్ గా కనిపిస్తా. ఇంతమందితో నటిస్తున్నా..నన్ను కార్నర్ చేస్తారేమో అని భయపడ్డా. కానీ అంతా బాగా సపోర్ట్ చేశారు. వేరే లెవల్ ఆఫీస్ మీకు మంచి వ్యూయింగ్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. తప్పకుండా చూడండి. అన్నారు.
నటి వసంతిక మాట్లాడుతూ – ఈ సిరీస్ లో నేను రమ్య అనే క్యారెక్టర్ లో నటించాను. తను ఒక చిన్న ఊరు నుంచి నగరానికి వస్తుంది. తనకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. కానీ అవి రీచ్ అయ్యేందుకు కొందరు అడ్డుపడతారు. వాటిని అధిగమించి రమ్య కోరుకున్నది ఎలా సాధించింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అన్నారు.
నటుడు మహేశ్ విట్టా మాట్లాడుతూ – వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ లో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. 50 ఎపిసోడ్స్ సిరీస్ ఇది. షూటింగ్ కోసం బిజీ బిజీగా కష్టపడుతున్నాం. మా డైరెక్షన్ టీమ్ అంతా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ థ్యాంక్స్. మీరు ఎంజాయ్ చేసేలా వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్ ఉంటుంది. అన్నారు.
నటుడు అఖిల్ వివాన్ మాట్లాడుతూ – వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్ లో నటించే అవకాశం ఇచ్చిన ఆహాకు థ్యాంక్స్. మా డైరెక్టర్ గారు సెట్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. చాలా ఫ్రాంక్స్ వేసేవారు. కొన్నిసార్లు నిజమేనని భయపడేవాళ్లం. మేము ఎంత హ్యాపీగా సిరీస్ చేశామో, చూస్తున్నంతసేపు మీకూ అలాగే ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. అన్నారు.
నటి రీతు చౌదరి మాట్లాడుతూ – వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్ లో లక్కీ అనే క్యారెక్టర్ చేశాను. నేను బయట ఎలా ఉంటానో ఈ క్యారెక్టర్ లోనూ అలాగే కనిపిస్తా. అందుకే ఈ క్యారెక్టర్ లో నటించేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. అన్నారు.
డైరెక్టర్ ఇ సత్తిబాబు మాట్లాడుతూ – తమిళంలో వేరే మాదిరి ఆఫీస్ వెబ్ సిరీస్ పెద్ద సక్సెస్ అయ్యింది. దాన్ని తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఆహా టీమ్ నన్ను అప్రోచ్ అయ్యారు. తెలుగు కోసం ఒరిజినల్ నుంచి 50 పర్సెంట్ మార్పు చేశాం. మన దగ్గర ఉండే కార్పొరేట్ ఫ్యామిలీస్ అందరికీ ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. స్క్రిప్ట్ వర్క్, ఆర్టిస్టుల సెలెక్షన్ కోసం కావాల్సినంత టైమ్ తీసుకున్నాం. పేరుకు తగినట్లే ఈ సిరీస్ వేరే లెవెల్ లో ఉంటుంది. అన్నారు.
స్క్రిప్ట్ రైటర్ ఎన్ షణ్ముక్ శ్రీనివాస్ మాట్లాడుతూ – సత్తి బాబు గారి ఒట్టేసి చెబుతున్నా సినిమా నా ఫేవరేట్ మూవీ. ఈరోజు ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్ కోసం చాలా స్ట్రాంగ్ స్క్రిప్ట్ చేశాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ కృపాచంద్ మాట్లాడుతూ – వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్ నిర్మించేందుకు ఆహా నుంచి మాకు కావాల్సినంత సపోర్ట్ లభించింది. సత్తి బాబు గారి లాంటి అనుభవం ఉన్న డైరెక్టర్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మంచి టీమ్ సపోర్ట్ తో వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్ ను అనుకున్నట్లు నిర్మించగలిగాం. డిసెంబర్ 12 నుంచి ఆహాలో మా సిరీస్ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
ఆహా కంటెంట్ హెడ్ వాసు మాట్లాడుతూ – ఆహాలో ఎన్నో జానర్స్ వెబ్ సిరీస్ లు, షోస్ చేస్తున్నాం. ఒక ఆఫీస్ సిట్ కామెడీ సిరీస్ చేయాలని భావించాం. ఈ కాన్సెప్ట్ యూనిక్ గా ఉంటుందని అనిపించింది. అలా వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్ కు ప్లానింగ్ మొదలైంది. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. అందరికీ నచ్చుతుంది. తమిళంలో సక్సెస్ అయిన ప్రాజెక్ట్ ను మన తెలుగు ఆడియెన్స్ కు మరింత రీచ్ అయ్యేలా తీసుకొస్తున్నాం. ప్యాషనేట్ అండ్ టాలెంటెడ్ టీమ్ తో ఈ సిరీస్ సక్సెస్ ఫుల్ గా మీ ముందుకు ఆహా తీసుకొస్తోంది. అన్నారు.
నటీనటులు – ఆర్ జే కాజల్, అఖిల్ సార్థక్, శుభశ్రీ, మిర్చి కిరణ్, రీతు చౌదరి, స్వాతి చౌదరి, వసంతిక, మహేశ్ విట్టా, రాజా విక్రమ్, రమణ భార్గవ, రాజేశ్, అఖిల్ వివాన్, మహేందర్.పి, శివరుద్ర తేజ, తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటర్ – సుబ్బు పొలిశెట్టి
మ్యూజిక్ – అజయ్ అరసాడ
డీవోపీ – చింతపల్లి ప్రదీప్ రెడ్డి
రచన – ఎన్ షణ్ముక్ శ్రీనివాస్, హరీశ్ కొహిర్కర్
కంటెంట్ హెడ్:వాసుదేవ్ కొప్పినేని
నిర్మాత – వరుణ్ చౌదరి గోగినేని
దర్శకత్వం – ఇ సత్తిబాబు