క్షమాపణలు కోరిన వేణు స్వామి

కొంతకాలం క్రితం అక్కినేని నాగచైతన్య, శోభిత వివాహం జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే వాళ్ళిద్దరూ వివాహానికి ముందు వారు ఒకటవుతున్నారని తెలిపిన సమయంలో వేణు స్వామి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారిద్దరి జాతకాలు తాను చూసినట్లు, వారిద్దరు ఎక్కువకాలం కలిసి ఉండారంటూ, త్వరలోనే విడాకులు తీసుకుంటారు అంటూ ఆయన జోష్యం చెప్పడం జరిగింది. అయితే దానిపై అక్కినేని అభిమానుల నుండి తీవ్ర వ్యతిరేక వచ్చింది. అంతేకాక ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ దీనిని తీవ్రంగా ఖండిస్తూ వేణు స్వామి పై క్షమాపణలు కోడాలంటూ తెలంగాణ ఉమెన్ కమిషన్కు కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేయగా వేణు స్వామి దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు వేణి స్వామి పవన్ కమిషన్ నందు హాజరు కావాల్సింది అని చెప్పడంతో వేణు స్వామికి ఉమెన్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. కాగా నేడు వీరస్వామి తెలంగాణ ఉమెన్ కమిషన్ వద్ద క్షమాపణ కోరారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఇకపై ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని ఉమెన్ కమిషన్ వేణు స్వామిని హెచ్చరించడం జరిగింది.