‘వి’లో వెన్నల కిషోర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

వెన్నెల సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ కిషోర్. మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్, వెన్నెల కిషోర్ గా మారి తెలుగు ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నాడు. బ్రహ్మానందం, అలీ, సునీల్, వేణు మాధవ్ ల తర్వాత ఆ స్థాయి స్టార్ డమ్ ని ఈ జనరేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఏకైక కమెడియన్ వెన్నెల కిషోర్. ఒక నెలలో 8 నుంచి పది సినిమాలు రిలీజ్ అయితే అందులో హీరోలు, హీరోయిన్లు మారుతున్నారు కానీ వెన్నల కిషోర్ మాత్రం మినిమమ్ 5 సినిమాల్లో కనిపిస్తున్నాడు. అంత బిజీగా ఉండే వెన్నెల కిషోర్ 39వ బర్త్ డే జరుపుకున్నాడు.

ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కిస్తున్న సినిమా ‘వి’ ది ఫిలిం. సుధీర్ బాబు హీరోగా, నాని మొదటిసారి విలన్ గా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సెట్స్ లోనే వెన్నెల కిషోర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకల ఫోటోలను సుధీర్ బాబు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. నాని, ఇంద్రగంటితో పాటు చిత్ర యూనిట్ కూడా ఉన్నారు. వెన్నెల కిశోర్ బర్త్ డే విషెస్ చెప్తూ టాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్స్ చేశారు.