సైరాని ముందుండి నడిపిస్తున్నారు…

భారీ బడ్జట్ తో తెరకెక్కిన మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వాటిని మరింత పెంచుతూ రీసెంట్ గా బయటకి వచ్చిన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. హిందీలో సైరాని ప్రమోట్ చేయడానికి అక్కడి టాప్ హీరోస్ స్వచ్చంధంగా బయటకి రావడం మెగాస్టార్ అంటే వాళ్లకి ఎంత ఇష్టం, గౌరవమే అర్ధమవుతుంది. ముందుగా సైరా గురించి స్పందించిన బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్. సైరా ట్రైలర్ ని ట్విట్టర్ షేర్ చేస్తూ “చరణ్ కి చిరంజీవి గారికి ఈ సినిమా మంచి విజయం అవ్వాలి అని కోరుకుంటున్నాను” అని పోస్ట్ చేశాడు.

సల్మాన్ ఖాన్ తో పాటు మరో స్టార్ హీరో ఆమీర్ ఖాన్ కూడా సైరా ట్రైలర్ లింక్ ని ట్విట్టర్ లో “ఇప్పుడే సైరా సినిమా ట్రైలర్ ని చూశాను. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని చేశారు. నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ఈ సినిమా చూడటానికి నేను వెయిట్ చేస్తున్నాను. చిరంజీవి సర్ కి, రామ్ చరణ్ కి మరియు సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు” అని పోస్ట్ చేశారు. ఈ ఇద్దరు ప్రమోట్ చేస్తూ ట్వీట్ చేయడంతో కొణిదెల ప్రొడక్షన్స్ ట్విట్టర్ హ్యాండిల్ థాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ని రామ్ చరణ్. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పై నిర్మించాడు.