వరుణ్ సందేశ్ “విరాజి” మూవీ జెన్యూన్ రివ్యూ

ఆధ్యాన్త్ హర్ష దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా M3 మీడియా, మహా మూవీస్ బన్నెర్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా విరాజి. ఈ సినిమాను మహేంద్ర నాథ్ కొండల నిర్మించగా ఎబ్బీ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో హీరోగా వరుణ్ సందేశ్ నటించగా రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరాం, వైవా రాఘవ తదితరులు కీలక పాత్రలలో నటించారు.

కథ :
సినిమా విషయానికి వస్తే ట్రైలర్లో చూపించినట్లుగా ఈ సినిమాలో ఎక్కువ శాతం ఓ పాడు పడిన భవనంలో జరుగుతుంది. ఒకరితో ఒకరికి సంబంధం లేని కొంత మంది ఒక సమస్యలో చిక్కుకోవడం జరుగుతుంది. ఆ సమస్య ఏంటి? ఆ సమస్య నుండి ఎంత మంది బయట పడతారు? బయట పాడని వారు ఏమవుతారు? అనేది ఈ సినిమా కథ. అయితే వారిలో వరుణ్ సందేశ్ ఉంటాడా లేదా? అసలు వరుణ్ సందేశ్ ఆ సమస్యలో చిక్కుకోవడానికి కారణం ఏంటి? ఆలా చిక్కికున్న వరుణ్ సందేశ్ చివరికి ఆ సమస్య నుండి బయట పడతాడా లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన :
సినిమా అంతటా కనిపించేది 10 మంది మాత్రమే. వారిలో వరుణ్ సందేశ్ గ్రే కాగా మిగతా వారు అంత పరిచయం ఉన్న ఆర్టిస్టులు కావడం సినిమాకు మంచి ప్లస్ గా నిలిచింది. సినిమాలో ప్రతి ఒక్కరు తమకు ఇచ్చిన కారక్టర్కు తగినట్లు నటిస్తూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. వరుణ్ సందేశ్ ఒక కొత్త లుక్ తో సినిమా చివరి వరుకు ఒక మంచి సస్పెన్ క్యారీ చేస్తూ నటించాడు. అలాగే రవితేజ, రఘు, ప్రమోదిని, వైవా రాఘవ తమకు తగ్గ పాత్రలలో సహజ సిద్ధంగా నటించారు.

సాంకేతిక విశ్లేషణ :
సినిమా స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ దర్శకుడు ఆ తక్కువ సమయంలోనే తాను చెప్పాలి అనుకున్నది ప్రేక్షకులకు అర్ధం అయ్యేలా చూపించడంలో విజయం సాధించాడు. అలాగే సినిమాలో సీన్ లకు తగ్గట్లు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో సంగీత దర్శకుడు ఎంత కష్టపడ్డాడో అర్ధం అవుతుంది. కొన్ని సమయాలలో స్క్రీన్ప్లే కొంచం సాగుతుంది అనిపించినప్పటికీ ఇటువంటి సస్పెన్స్ త్రిల్లర్ డ్రామాలలో ఆమాత్రం సాగదీయడం ఉండటమే మంచిది అనిపిస్తుంది. అద్భుతమైన నిర్మాణ విలువలతో ఈ సినిమా తీయడంలో అటు నిర్మాతలు అలాగే ఇటు దర్శకుడు విజయం సాధించాడు.

ప్లస్ పాయింట్స్:
వరుణ్ సందేశ్ అలాగే మిగతా నటీనటుల నటన, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, దర్శకత్వం, నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లేలో అక్కడక్కడా కొంచం సాగతీత, ఒకటే లొకేషన్ లో సినిమా తీయడం, కొంచం లౌ లైట్

సారాంశం:
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారు మిస్ కాకుండా చూడవలసిన సినిమా.