కోలీవుడ్ నటి వనిత విజయకుమార్ ప్రస్తుతం నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. మొన్నటివరకు తమిళ మీడియా వరకే పరిమితమైన ఆమె వివాదాలు కాంట్రవర్సీలు ఇప్పుడు నేషనల్ లెవెల్లో వైరల్ అవుతున్నాయి. మొదటి భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని మూడో పెళ్లి చేసుకొని చిక్కుల్లో పడిన వనిత ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది.
బీజేపీపై ఆమె వ్యంగ్యంగా కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళ టీవీ నటుడు నంజి విజయన్ బయటపెట్టిన ఆ విడియోలో వనిత బీజేపీపై కొన్ని కామెంట్స్ చేసింది. పది మంది కూడా లేని ఆ పార్టీలో తన తండ్రి విజయకుమార్ కీలక నేతగా కొనసాగుతున్నారని ఆ పార్టీ తమిళనాడుపై స్పెషల్ ఫోకస్ చేసిందని కామెంట్స్ చేసింది. ఆమె ట్రోల్ చేసిన విధానం ఇప్పుడు తమిళ బీజేపీ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.