తెలుగు జనాలను ఎంతగానో అలరించిన ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతి చెందారు. గత కొద్దీ కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలోని స్వగృహంలోనే తుది శ్వాస విడిచారు. వందలాదిపైగా జానపదలను ఆయన రచించారు.
తన జానపద పాటలతో ఎంతో స్ఫూర్తిని నింపారు. ఉత్తరాంధ్ర జనపదాలను గజ్జెకట్టి ఆడిపాడారు. పల్లెకారులతో పాటు గిరిజనులను కూడా చైతన్య పరిచారు. ఇక ఆయన హఠాత్తుగా మృతి చెందడంతో జానపద కళాకారులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా పలువురు సినీ ప్రముఖులు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకున్నారు.