సాంగ్ వినడానికి కొత్తగా, చూడడానికి అందంగా ఉంది

కెరీర్ అయిపోయే టైంలో బిగ్ బాస్ షోతో ఆడియన్స్ కి దెగ్గర అయ్యి మళ్లీ ఇండస్ట్రీలోకి కంబాక్ ఇవ్వడానికి రెడీ అయిన హీరో వరుణ్ సందేశ్. ఇందువదన మూవీతో రిఎంట్రీ ఇస్తున్న వరుణ్ సందేశ్ పోస్టర్స్ అండ్ లుక్స్ తోనే ఆకట్టుకుంటున్నాడు. కెరీర్ లో ఎప్పుడూ లేనంత ఫ్రెష్ గా కనిపిస్తున్న వరుణ్ సందేశ్, ఇందువదన మూవీలో ఫర్నాజ్ శెట్టితో కలిసి నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్ ఒక వింటేజ్ సినిమాని గుర్తు చేస్తూ కొత్త ఫీల్ ని ఇచ్చాయి. ముఖ్యంగా గిరిజన యువతి గా కనిపించనున్న ఇందు బోల్డ్ లుక్ కి అందరూ ఫిదా అయ్యారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి “వడి వడిగా” మొదటి మెలోడీ పాటని రిలీజ్ చేశారు.

వడివడిగా పాట లిరిక్స్ ను తిరుపతి జావన రాయగా జావిద్ ఆలీ, మాళవిక ఆలపించారు.. శివ కాకాని అందించిన సంగీతం ఈ సాంగ్ కి హైలెట్ గా నిలిచేలా ఉంది. క్యాచీ లిరిక్స్, వినగానే అట్రాక్ట్ అయ్యే మ్యూజిక్, వింటేజ్ విజువల్స్ ఇవన్ని కలిసి వడివడిగా సాంగ్ ని చాలా స్పెషల్ గా మార్చాయి. ఎమ్ఎస్ఆర్ దర్శకత్వంలో మహేష్ ఆదుర్తి ఈ చిత్రంలో ధనరాజ్, మహేష్ విట్టా, తాగుబోతు రమేష్, సురేఖ వాణి, పార్వతీశం తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.