రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై విభ్యోర్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో శ్రీకృష్ణ రచనా దర్శకత్వంలో దెయ్యాల భారతి మణికలా రాధా, ఎండి యూనస్ నిర్మాతలుగా శక్తి జీకే సినిమాగా పనిచేస్తూ అనిల్ అర్కా, విహారికా చౌదరి, ప్రశాంత్ మడుగుల, రిది తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వారధి. డిసెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది అంటే….
కథ:
కొత్తగా వివాహం జరిగిన ఇద్దరి ఓ జంట మధ్య జరిగే కథగా చెప్పుకోవచ్చు. అయితే వివాహం జరిగిన కొద్ది రోజులకే వారి మధ్య మనస్పర్ధలు రావడం, ఆ తరువాత భార్య జీవితంలోకి మరొకరు రావడం, అదే సమయంలో భర్తకు అనుకోని ఒక సంఘటన జరగటం వంటివి జరుగుతాయి. అయితే ఆ తర్వాత వారి జీవితంలో ఏం జరుగుతుంది? వచ్చిన మూడో వ్యక్తి వల్ల వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి? చివరగా తన భర్తకు భార్య దగ్గర అవుతుందా? దూరమవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మీ చిత్రం చూడాల్సిందే.
నటీనటుల నటన :
ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రకు తగ్గట్లు నటిస్తూ ఆ పాత్రకు న్యాయం చేయడం జరిగింది. ముఖ్యంగా అనిల్ భావోద్వేదాలు అద్భుతంగా ప్రదర్శించారు. అదేవిధంగా విహారిక తన నటనతో ప్రేక్షకులు ఆకట్టుకుంటూ కథకు తగ్గట్లు నటించారు. ప్రశాంత్ విలన్ పాత్రలో కఠినంగా ప్రవర్తిస్తూ నటించారు. రిధి తన పాత్ర పరిమితిలో నటించిన జరిగింది.
సాంకేతిక విశ్లేషణ:
రచన దర్శకత్వంలో శ్రీకృష్ణ తనదైన శైలిలో విజయం సాధించడమే చెప్పుకోవాలి. అదేవిధంగా నటీనటులను పూర్తిగా తన రాసుకున్న పాత్రలకు న్యాయం చేసే విధంగా ఉపయోగించుకున్నారు. బ్యాకౌండ్ మ్యూజిక్ ఇంకా ఇతర సాంకేతిక విశ్లేషలలో కూడా తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రం నుంచి ట్విస్టులు కూడిన కథగా ఉంది. మంచి నిర్మాణ విలువలతో సీన్లకు తగ్గట్లు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.
ప్లస్ పాయింట్స్:
కథ, దర్శకత్వం, నటీనటుల నటన.
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ కొంచెం అర్థంకాని పాయింట్స్.
సారాంశం:
ఉత్కంఠ పరిచే థ్రిల్లర్గా వచ్చినవి చిత్రం అందరిని ముఖ్యంగా రొమాన్స్ తో యూత్ ని ఆకట్టుకునే విధంగా ఉంది.