లాల్ డౌన్ సడలింపులతో మొత్తానికి థియేటర్స్ ఓపెన్ కాబోతున్నాయి. అయితే కొన్ని సినిమాలను రిలీజ్ చేసి పరిస్థితిపై ఒక అవగాహనకు రావాలని యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. ఇక అందులో భాగంగా ఆల్ రెడీ ఓటీటీ లో విడుదలైన సినిమాలు థియేటర్స్ లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నాని V అనుష్క యొక్క నిశ్శబ్దం సినిమా కోస అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూసారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాలు రెండు కూడా ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు థియేటర్స్ లలో కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరిచిన తర్వాత అక్టోబర్ 15 తర్వాత ఈ రెండు చిత్రాలను తిరిగి విడుదల చేయనున్నట్లు సమాచారం. అక్టోబర్ 15 నుండి తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ స్క్రీనింగ్ నిర్వహించడానికి సిద్ధంగా ఉంది మరియు AP యొక్క థియేటర్స్ అసోసియేషన్ నుండి స్పష్టత రావాల్సి ఉంది. కారణం ఏమైనప్పటికీ, ఈ రెండు సినిమాలు మరోసారి విడుదల కానున్నాయి. ఇక OTT ప్లాట్‌ఫామ్‌లకు ప్రాప్యత లేని చిన్న పట్టణంలో ఉన్నవారందరూ ఈ సినిమాలను చూస్తారు అనేది నిర్మాతల ఆశ.