కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ ‘UI ది మూవీ’ చిత్రంతో రాబోతున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. రీసెంట్ గా రిలీజ్ చేసిన వార్నర్ వీడియో ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది.
తాజాగా UI ది మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఉపేంద్ర మిషన్ గన్ తో డైనమిక్ గా నిలుచున్న సెన్సార్ సర్టిఫికేట్ పోస్టర్ అదిరిపోయింది.
గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
చాలా గ్యాప్ తర్వాత ఉపేంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మించారు. విజువల్ గా, టెక్నికల్ గా సినిమా అత్యున్నతంగా వుండబోతోంది.
ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ మెటిరియల్ సినిమాపై అంచనాలని పెంచింది. ట్రోల్, చీప్ సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ అయ్యాయి. రీసెంట్ గా రిలీజైన వార్నర్ వీడియో నేషనల్ వైడ్ వైరల్ అయ్యింది.
ఈ చిత్రంలో రీష్మా నానయ్య, మురళీ శర్మ, సన్నీలియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీ కృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. హెచ్‌సి వేణుగోపాల్ డీవోపీ కాగా, ఆర్ట్ డైరెక్షన్ శివ కుమార్ J (KGF1&2 ఫేమ్), VFX ని నిర్మల్ కుమార్ (విక్రాంత్ రోనా ఫేమ్) పర్యవేక్షిస్తున్నారు.
ఈ చిత్రం డిసెంబర్ 20, 2024న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.