గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ ‘గేమ్ ఛేంజ‌ర్‌’ సినిమా నుంచి అప్డేట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’ సాంగ్‌, వస్తోన్న అప్డేట్లతో  గేమ్ ఛేంజ‌ర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి మ‌రో క్రేజీ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సెప్టెంబ‌ర్ నెల‌లో సినిమా నుంచి మ‌రో సాంగ్‌కి సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మేక‌ర్స్ తెలియ‌జేశారు.

ఇప్ప‌టికే ‘గేమ్ చేంజర్’ నుంచి తమన్ సంగీత సారథ్యంలో వచ్చిన ‘జరగండి జరగండి..’ పాట ఎంత సెన్సేష‌న్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. తాజాగా వినాయ‌క చ‌వితికి ఇచ్చిన అప్‌డేట్ పోస్ట‌ర్, అందులోని న్యూస్ అభిమానులు స‌హా అంద‌రిలోనూ మ‌రింత ఉత్సాహాన్ని నింపేలా ఉంది. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. త‌ల‌కు ఎర్ర‌టి ట‌వ‌ల్ చుట్టుకుని స్టైలిష్ అవ‌తార్‌లో క‌నిపిస్తున్నారు రామ్ చ‌ర‌ణ్‌. ఆయ‌న బ్యాగ్రౌండ్‌ను గ‌మ‌నిస్తే.. ఉత్స‌వంలో వేషధార‌ణ చేసుకున్న‌ట్లు ఉండేలా కొంద‌రు ఉన్నారు. అంద‌రూ సంతోషంగా డాన్స్ చేస్తూ క‌నిపిస్తున్నారు.

డైరెక్ట‌ర్ శంక‌ర్ లార్జర్ దేన్ లైఫ్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌ట‌మే కాకుండా, అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు సినిమా డిఫ‌రెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంటారు. రామ్ చ‌ర‌ణ్‌లాంటి మాస్ హీరో ఉన్న‌ప్పుడు ఆ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంటుందో చూడాల‌ని మెగాభిమానులు, మూవీ ల‌వర్స్ ‘గేమ్ ఛేంజ‌ర్‌’ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను ఆయ‌న రూపొందిస్తున్నారు. పవరఫుల్  రోల్ లో చ‌ర‌ణ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు శంక‌ర్‌.

గేమ్ చేంజర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్స్ ప్రైజ్‌కి దక్కించుకుంది.

న‌టీ న‌టులు:
రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  శంక‌ర్
నిర్మాణ సంస్థ‌లు: శ‌్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, జీ స్టూడియోస్‌
నిర్మాత‌లు:  దిల్ రాజు, శిరీష్‌
రైట‌ర్స్‌:  ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, వివేక్‌
స్టోరీ లైన్‌:  కార్తీక్ సుబ్బ‌రాజ్‌
కో ప్రొడ్యూస‌ర్‌:  హ‌ర్షిత్‌
సినిమాటోగ్ర‌ఫీ:ఎస్‌.తిరుణావుక్క‌ర‌సు
మ్యూజిక్‌:  త‌మ‌న్.ఎస్‌
డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా
లైన్ ప్రొడ్యూస‌ర్స్‌: న‌ర‌సింహారావ్‌.ఎన్‌,  ఎస్‌.కె.జ‌బీర్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  అవినాష్ కొల్ల‌
 యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌:  అన్బ‌రివు
డాన్స్ కొరియోగ్రాఫ‌ర్స్‌:  ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ ర‌క్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ
లిరిసిస్ట్‌:  రామ‌జోగ‌య్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌, కాస‌ర్ల శ్యామ్‌
ఎడిట‌ర్‌:  షామీర్ ముహ్మ‌ద్
సౌండ్ డిజ‌న‌ర్‌:  టి.ఉద‌య్‌కుమార్‌
పి.ఆర్.ఒ:  నాయుడు సురేంద్ర కుమార్ – ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా)