వెబ్ సిరీస్ తో రానున్న “నాని”.. V తరువాత బడా ప్లాన్?

నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటుందని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎక్కువగా ఆకర్షించే నాని ఇక నుంచి రెగ్యులర్ సినిమాలు కాకుండా ఎంతో కొంత డిఫరెంట్ మూవీస్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక త్వరలోనే ఈ టాలెంటేడ్ హీరో ఒక వెబ్ సిరీస్ తో రానున్నట్లు తెలుస్తోంది.

నాని 25వ సినిమా V అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత రిలీజ్ చేయాలని అనుకున్నారు గాని ఇప్పట్లో పరిస్థితులు అదుపులోకి వచ్చేలా లేవని సెప్టెంబర్ 5న ఓటీటీలోనే సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ సినిమా తరువాత నాని తన వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లోనే ఒక వెబ్ సిరీస్ ని నిర్మించనున్నాడట. నాని అందులో నటిస్తాడా లేదా అన్నది తెలియదు గాని యువ దర్శకుల నుంచి చాలా కథలు వింటున్నాడట. ఆల్ రెడీ రెండు స్క్రిప్ట్ లను ఓకే చేసినట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.