స్టోరీ వినకుండానే పవన్ కళ్యాణ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్యూటీ?

టాలీవుడ్ లో గత రెండేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న బ్యూటీ పూజ హెగ్డే. ఆమె లక్కేమిటో గాని సినిమాల విజయాలు క్రేజ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ముఖ్యంగా అల.. వైకుంఠపురములో సినిమా అమెకున్న రెమ్యునరేషన్ స్థాయిని కూడా పెంచేసింది. ఇక నెక్స్ట్ ఈ హాట్ బ్యూటీ పవన్ కళ్యాణ్ తో కూడా నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే చేతిలో మరో రెండు పెద్ద ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఆ సినిమాలతో పాటు పూజా హెగ్డే పవన్ కళ్యాణ్ తో జోడి కట్టేందుకి సిద్ధమైనట్లు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల దర్శకుడు పూజను సంప్రదించగా స్టోరీ వినకముందే డేట్స్ ఎప్పుడు కావాలని అడిగేసిందట. హరీష్ శంకర్ తో ఇదివరకే పూజ డీజే సినిమాతో పాటు గద్దల కొండ గణేష్ సినిమాలు చేసింది. రెండు కూడా బాక్సాఫీస్ వద్ద క్లిక్కవ్వడంతో పాటు హరీష్ తో మరోసారి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అందులోనూ పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి స్టోరీ కూడా వినాల్సిన అవసరం లేదని వెంటనే ఓకే చెప్పినట్లు టాక్.