టాలీవుడ్ నటీనటులు డ్రగ్స్ ను అరికట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటి శ్రీలీల, నటుడు అడవి శేష్, నిఖిల్ సిద్ధార్థ్, ప్రభాస్ ఇప్పటికే ఈ విషయంపై తమదైన శైలిలో ప్రజలందరికీ డ్రగ్స్ కు నో చెప్పమంటూ విన్నపించుకున్నారు. డ్రగ్స్ జీవితాలను నాశనం చేస్తాయని, మనల్ని ప్రేమించే మనుషులు మనకు ఉండగా ఈ డ్రగ్స్ మనకు ఎందుకు అంటూ డ్రగ్స్ ని దూరం పెట్టమని సూచించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాలకు దూరంగా ఉండమని ప్రజలను సూచిస్తూ ఉండగా టాలీవుడ్ నటులు కూడా ఈ కార్యక్రమంలో భాగమవుతూ డ్రగ్స్ కి నో చెప్పమని ప్రజలకు సందేశం ఇచ్చారు.