టాలీవుడ్‌లో విషాదం: ప్రముఖ సినీ రచయిత మృతి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు సినీ రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతితో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాభ సానుభూతి తెలియజేస్తున్నారు.

Liric writer Vellelakanti Died
Liric writer Vellelakanti Died

ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు శశాంక్ వెన్నెలకంటి, రాకేందు మౌళి. భార్య పేరు ప్రమీలాకుమారి. శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ సినిమాలకు సంభాషణల రచయితగా ఉండగా.. రాకేందు మౌళి సినిమా గీత రచయితగా పనిచేస్తున్నారు.

తొలిసారిగా శ్రీరామచంద్రుడు సినిమాలోని చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల అనే పాట రాశారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి రాశారు. ఇప్పటివరకు మొత్తం 2 వేల పాటలు ఆయన రాశారు.