నేడు సీనియర్ నటుడు నరేశ్ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. నరేశ్ గారు 1963సంవత్సరంలో జనవరి 20వ తేదీ నాడు జన్మించారు. నేడు ఆయన బర్త్‌డే సందర్భంగా ఆయన గురించి విషయాలను చూద్దాం.. నరేశ్ ఒకప్పుడు హీరోగా చేసిన సందడినీ ప్రేక్షకులెవరూ మర్చిపోలేరు. కృష్ణ సతీమణి విజయనిర్మల తనయుడే నరేశ్.. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన పలు చిత్రాల్లో బాలనటునిగా నరేశ్ కనిపించాడు. నరేశ్ తన తల్లిగారైనా విజయనిర్మల గారి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ సంకేళ్లుతో కెమెరా ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే ప్రముఖ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన నాలుగు స్తంభాలట (1982)లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
దీంతో ఆ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత దివంగత విజయనిర్మల గారు దర్శకత్వం వహించిన ప్రేమ సంకెళ్లు తర్వాత రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను అలరించకపోయినా.. నరేశ్ గారికి నటుడిగా పేరు తెచ్చిపెట్టింది. ఇక జంధ్యాల దర్శకత్వం వహించిన రెండు జళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, పుత్తడి బొమ్మ, శ్రీవారి శోభనం, మొగుడు పెళ్లాలు, చూపులు కలిసిన శుభవేళ, హై హై నాయకా. బావా బావా పన్నీరు, ప్రేమ ఎంత మధురం వంటి చిత్రాలతో నరేశ్ గారు ప్రేక్షకులకు నవ్వులు పూయించారు. ఇక జంధ్యాల గారి శిష్యుడైన ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ చిత్రంలో నరేశ్ నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది.. ఈ సినిమా ఎంతో ఘన విజయం సాధించిపెట్టింది. అలాగే 1992లో పి,యన్. రామచంద్రరావు రూపొందించిన భళారే విచిత్రం చిత్రంలో నరేశ్ గారు స్త్రీ పాత్రను పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో భళా అనిపించాడు. ఈ విధమైన పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మురిపించాడు నరేశ్ గారు. ఆ తర్వాత నరేశ్ గారు హీరోగా తెరకెక్కిన చిత్రాలు ఏవీ కూడా ఆకట్టుకోలేకపోవడంతో, క్యారెక్టర్ రోల్స్ సినిమాలు చేస్తూ.. ఈ విధంగా కూడా ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తున్నారు. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా నరేశ్ గారు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ.. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నారు. నరేశ్ గారు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులకు మరింతగా నవ్వులు పూయించాలని.. TFPC తరపున నరేశ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.