Rashmika: బంతి పూలు అల్లుతూ చీర‌లో ఎంత క్యూట్‌గా ఉందో ర‌ష్మిక..

Rashmika: టాలీవుడ్ యువ హీరో శ‌ర్వానంద్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఆడ‌వాళ్లు మీకు జోహార్లు చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈచిత్రంలో శ‌ర్వాకు జోడీగా టాలెంట‌డ్ బ్యూటీ ర‌ష్మీకా మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. కాగా నేడు ర‌ష్మిక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ.. పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది చిత్ర‌బృందం. ఆ పోస్ట‌ర్‌లో ప‌చ్చ‌ని తోట‌లో ఆమె చీర‌క‌ట్టుతో బంతి పూలు అల్లుతూ చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపిస్తుంది.

Rashmika poster

ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇక ఈ చిత్రానికి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గా.. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌కటించ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ‌