Powerstar: బానిస సంకెళ్ల‌ను వ‌దులు అంటూ ఆడ‌వాళ్ల‌కు ధైర్యం చెప్పిన వ‌కీల్‌సాబ్!

Powerstar: ప‌వ‌ర్‌స్టార ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన వ‌కీల్‌సాబ్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌లు నిన్న రాత్రి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి. దీనికి హైద‌రాబాద్‌లోని శిల్పాక‌ళా ఆడిటోరియం వేదిక‌గా ప‌వ‌న్‌ ఫ్యాన్స్‌తో మారు మ్రోగింది. కాగా ఈ వేడుక‌ల్లో భాగంగా ఈ చిత్రం నుంచి మ‌రో సాంగ్‌ను సింగ‌ర్స్‌తో ప‌ర్‌ఫార్మెన్స్ చేశారు. ఆ స్టేజ్ మీద‌నే ఈ సాంగ్ రిలీజ్ చేశారు.

vakeelsaab

క‌దులు క‌దులు క‌ట్లు తెచ్చుకుని క‌దులు.. వ‌దులు వ‌దులు వ‌దులు బానిస సంకెళ్ల‌ను వదులు.. అంటూ సాగే సాంగ్ గూస్‌బంప్స్ తెప్పించాయి.. ఈ సాంగ్‌ను సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ ఈ రోజు యూట్యూబ్ ద్వారా రిలీజ్ కానుంద‌ని సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ తెలిపారు. ఈ చిత్రం ఉగాది కానుక‌గా ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది.‌