‘టిల్లు స్క్వేర్’ ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే….

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. తెలుగు సినిమా ప్రేక్షకుల మన్నన పొంది వందకోట్ల మార్కెట్లో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. మల్లిక్ రామ్ దర్శకత్వంలో సితార ఈ సినిమా మార్చ్ 29వ తేదీన రిలీజ్ కావడం జరిగింది. యువతను అలాగే కుటుంబ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుని ఇంకా థియేటర్లలో నడవడం విశేషం.

అయితే సినిమా ప్రేమికులు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. కాగా క్రిస్టోఫర్ కనకరాజ్ గారు ఈ సినిమా ఏప్రిల్ 26 నుండి నెట్ఫ్లిక్స్ లో రాబోతున్నట్లు ట్వీట్ చేశారు. అది చూసిన టిళ్ళు సినిమా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.