మరో టాలెంట్ బయటపెట్టిన టైగర్

బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ టైగర్ ష్రాఫ్ మరో టాలెంట్ ని బయటపెట్టాడు. ఇప్పటివరకూ హీరోగా మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్ట్ గా మాత్రమే తెలిసిన టైగర్, ఇప్పుడు తనలోని సింగింగ్ టాలెంట్ ని పరిచయం చేస్తూ అన్ బిలీవబుల్ సాంగ్ ని రిలీజ్ చేశాడు. బిగ్ బ్యాంగ్ మ్యూజిక్ తో టైఅప్ అయిన టైగర్, ఈ ఆల్బమ్ సాంగ్ లో యాక్ట్ చేయడమే కాకుండా పాడడం కూడా విశేషం. మోస్ట్ ఆఫ్ ది సాంగ్ బ్లాక్ అండ్ వైట్ లో షూట్ చేయగా, టైగర్ ఎప్పటిలాగే తన కూల్ మూవ్స్ తో ఆకట్టుకున్నాడు. టైగర్ మంచి డాన్సర్ అనే విషయం అందరికీ తెలిసిందే కానీ అన్ బిలీవబుల్ సాంగ్ చూస్తే టైగర్ లో మంచి సింగర్ కూడా అనిపించకమానదు. పునీత్ మల్హోత్రా డైరెక్ట్ చేసిన ఈ సాంగ్ రిలీజ్ అయిన మూడు గంటల్లోనే 4లాక్ వ్యూస్ తెచ్చుకోని టాప్ ట్రెండింగ్ లో ఉంది.