థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ‘కల్కి’ మూవీ ఓటిటి రిలీజ్ – ఎక్కడ ఎందులో చూడాలంటే?

ప్రవీణ్ ప్రభురాం దర్శకత్వంలో టోవినో థామస్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా ప‌ద్మ‌నాభ‌న్‌, విని విశ్వ‌లాల్ కీల‌క పాత్రల్లో నటించిన చిత్రం కల్కి. 2019లో మలయాళం లో విడుదలై భారీ వసూళ్లను రాబట్టిన సినిమా ఇప్పుడు తెలుగులో ఈరోజు నుంచి ఈటీవీ విన్ యాప్ లో అందుబాటులో ఉంది. పోలీస్ గ్రామ యాక్షన్ మరియు త్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో సాగే సినిమా మలయాళం లో మంచి విజయాన్ని సాధించింది.

తమిళనాడు మలయాళ బోర్డర్లో ఉన్న ప్రాంతాన్ని తన రౌడీ రాజకీయ బలంతో వెళ్తున్న అమర్నాథ్ ను ఎదుర్కొనే పోలీస్ ఆఫీసర్ గా ట టోవినో థామస్ అద్భుతంగా నటించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయని ప్రశంసలు అందుకుంది ఈ సినిమా.

టోవినో థామస్ పోలీస్ ఆఫీసర్ గా ఆ రౌడీ రాజకీయ నాయకుడిని ఎలా ఎదుర్కొన్నాడు? తన ఆగడాలకు ఎలా చెప్పి పెట్టాడు? అనే కథాంశంగ. అది తెలుసుకోవాలంటే యాక్షన్ త్రిల్లింగ్ సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం టోవినో థామస్ మోహన్ లాల్ లూసిఫర్ 2 లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా ఏ ఆర్ ఎం మూవీలో మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇవే కాకుండా ఇంకో నాలుగు సినిమాలు కూడా చేస్తున్నారు.