సమ్మర్‌లో పోటీలోకి ముగ్గురు టాప్ హీరోలు

లాక్‌డౌన్ తర్వాత తిరిగి టాలీవుడ్ మళ్లీ పూర్వవైభవాన్ని తెచ్చుకుంటోంది. థియేటర్లు ఓపెన్ కావడంతో వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మెగా హీరో సాయిధరమ్ తేజ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో బోణీ కొట్టగా.. సంక్రాంతికి సినిమాల పండుగ స్టార్ట్ కానుంది. సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాతో పాటు రామ్ పోతినేని హీరోగా నటించిన ‘రెడ్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న ‘అల్లుడు అదుర్స్’, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి.

vakeel saab

ఇక వచ్చే ఏడాది సమ్మర్‌లో ఏకంగా ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్‌కి రెడీ అయ్యాయి. ఒకటి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా.. నూతన సంవత్సరం సందర్భంగా టీజర్ విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మూడు సంవత్సరాల తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో.. దీని కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది.

ఇక ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో వస్తున్న రాధేశ్యామ్ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్య సినిమాను మే 14న విడుదల కానుందని సమాచారం. ఆచార్యలో రాంచరణ్ కూడా కీలక పాత్రలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.