మరో రూట్‌లోకి సోనూసూద్

సినిమాల్లో పవర్‌ఫుల్ విలన్ పాత్రలలో ప్రేక్షకులను అలరించిన సోనూసూద్.. లాక్‌డౌన్‌లో ఎంతోమందికి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. వలస కార్మికులను సొంత డబ్బులతో సొంతూళ్లకు పంపించడంతో పాటు ఉద్యోగాలు కోల్పోయిన ఎంతోమంది నిరుద్యోగులకు అండగా నిలిచాడు. సోషల్ మీడియా ద్వారా ఆపదలో ఉన్నవారి కష్టాలను తెలుసుకుని హెల్ప్ చేశాడు. ఎవరూ కష్టాల్లో ఉన్నారని తెలిసినా.. వెంటనే సహాయం చేసేవాడు.

SONUSOOD PRODUCER

దీంతో ఓవర్ నైట్‌లో రియల్ హీరోగా మారిన సోనూసూద్‌ని రాజకీయాల్లోకి రావాలని చాలా పార్టీలు ఆహ్వానించాయి. కానీ వాటిని సోనూసూద్ సున్నితంగా తిరస్కరించారు. అయితే ఇప్పుడు సోనూసూద్ కొత్త రూట్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఆయన నిర్మాతగా కొత్త అవతారమెత్తనున్నాడు. శక్తి సాగర్ ప్రొడక్షన్స్ పేరుతో ఒక బ్యానర్‌ను సోనూసూద్ ఏర్పాటు చేశాడు. సోనూసూద్ తండ్రి పేరు శక్తి సాగర్. అందుకే ఆ పేరు పెట్టారు.

ప్రస్తుతం కథలను సోనూసూద్ వింటున్నాడు. తమ బ్యానర్ నుంచి మంచి కథలను తీసుకురావాలని సోనూసూద్ భావిస్తున్నాడు. స్పూర్తిదాయకమైన కథలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అతడు భావిస్తున్నాడు. కథలకు సంబంధించిన చర్చలు జరుగుతుండగా.. త్వరలో ఆయన బ్యానర్‌పై సినిమాలు తెరకెక్కే అవకాశముంది. ప్రస్తుతం ఆచార్య సినిమాతో పాటు అల్లుడు అదుర్స్ సినిమాలో సోనూసూద్ నటిస్తున్నాడు.