బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటితో జంటగా కిశోరి దాత్రక్ నటిస్తూ వచ్చిన సినిమా తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ నిర్మించడం జరిగింది. యువ హీరో చైతన్యరావు ఈ చిత్రంలో కీలకమైన పాత్రను పోషించారు.
కథ: తెలంగాణ లోని తెప్ప సముద్రం అనే ఓ గ్రామంలో ఈ సినిమా నడుస్తుంది. ఆ ఊరిలోని చిన్న పిల్లలు కనిపించకుండా పోవడం, వారి కోసం అందరు ఆందోళన చెందడం జరుగుతుంది. అయితే చైతన్య రావు సినిమాలో ఆ గ్రామా ఎస్ఐ పాత్రా పోషించారు. అర్జున్ అంబటి, హీరోయిన్ ఆ పిల్లల కోసం ఎలా వెతుకుతారు. అలాగే ఎస్.ఐ తండ్రి లాయర్(డైలాగ్ కింగ్ సాయికుమార్ సోదరుడు రవిశంకర్) కూడా తన వద్దకు వచ్చే ట్యూషన్ పిల్లలు తప్పి పోవడంతో ఈ మిస్సింగ్ కేస్ ను ఛేదించడానికి తనవంతు ప్రయత్నం చేస్తుంటారు. ఎలా ఎవరికి వారు తప్పిపోయిన చిన్నారులకోసం తమ వంతు ప్రయత్నాలు చేసే క్రమంలో అందరూ విస్తుపోయే నిజం ఒకటి బయటకు వస్తుంది. అది ఏమిటి? తప్పి పోయిన చిన్నారులు ఏమయ్యారు? చివరకు లాయర్ విశ్వనాథ్ తీసుకున్న ఆ కఠినమైన నిర్ణయం ఏమిటి? అనే విషయాల చుట్టూ సినిమా ఉంటుంది.
నటీనటులు: హీరోగా అర్జున్ అంబటి బాగా నటించారు. హీరోయిన్ పాత్రకు కిశోరి దాత్రక్ న్యాయం చేశారు అని చెప్పుకోవాలి. అయితే ఎస్ఐ గా చైతన్య రావు ప్రేక్షకులను మెప్పించారు. ఇక రవి శంకర్ నటన, తన పాత్ర సినిమాకు ప్లస్ గా నిలిచాయి. మిగతా నటీనటులు కూడా తమకు తగ్గ పాత్రలలో మెప్పించారు అనే చెప్పుకోవాలి.
సాంకేతికత విషయానికి వస్తే: దర్శకుడు కథ, స్క్రీంప్లై బావుంది. సంగీతం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ వాస్తవిక సంఘటనలు ఆధారంగా తీసినట్లు ఉంది ఈ సినిమా. ప్రొడక్షన్ విలువలకు తగ్గట్లు సినిమా ఉంది అని చెప్పుకోవచ్చు.