‘వరుడు కావలెను‘ కథానాయకుడు ‘నాగ శౌర్య’ కు పుట్టినరోజు శుభాకాంక్షలు – సితార ఎంటర్ టైన్మెంట్స్ !!

నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం ‘వరుడు కావలెను‘ వీడియో చిత్రం విడుదల

  • ‘వరుడు కావలెను‘….! కథానాయకుడు నాగ శౌర్య కు పుట్టినరోజు శుభాకాంక్షలు దృశ్య రూపంలో విడుదల చేసిన చిత్రం యూనిట్
  • వీడియో చిత్రం లో చూడ ముచ్చటగా ఉన్న ‘నాగ శౌర్య

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘

చిత్ర కథానాయకుడు ‘ నాగ శౌర్య‘ పుట్టినరోజు నేడు (22-1-2021) . ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ‘ వరుడు కావలెను‘ చిత్రం యూనిట్ ఓ అందమైన, ఆకర్షణీయమైన వీడియో చిత్రం ను విడుదలచేశారు. ఈ చిత్రం లో అందమైన కథానాయకుడు నాగ శౌర్య మరింత అందంగాఅలంకరించుకోవడం, ముస్తాబవుతున్న
దృశ్యాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. వీడియో చివరలో 2021 మే నెలలో చిత్రం విడుదల అవుతుందన్న విషయం కూడా తెలుస్తుంది. ఇంతకు ముందు లాగానే ఈ వీడియో చిత్రానికి చిత్ర సంగీత దర్శకుడు విశాల్ చంద్ర శేఖర్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.

ఇంతకుముందు చిత్రం పేరును అధికారిక ప్రకటన చేస్తూ ఓ వీడియో ను కూడా ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియో లో కూడా నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపించారు. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తేవటమే కాదు ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి. .ఆ తరువాత 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఓ ప్రచారచిత్రం విడుదల చేశారు.ఈ చిత్రంలో చూడ ముచ్చటగా ‘నాగ శౌర్య , రీతువర్మ’ ల జంట కనిపిస్తుంది. ఇవన్నీ ప్రేక్ష కాభి మానులను మరెంత గానో అలరించాయి. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్

నిర్మాత: సూర్య దేవర నాగవంశీ

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య