‘పుష్ప’ బడ్జెట్ ఎంతో తెలుసా?

టాలీవుడ్‌లో బన్నీ-సుకుమార్‌ది సూపర్ హిట్ కాంబినేషన్. ప్రస్తుతం ఈ సూపర్ హిట్ కాంబినేషన్‌లో పుష్ప సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రూ.180 కోట్ల బడ్జెట్‌తో తీయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.

pushpa budget

అల్లు అర్జున్ రూ.40 కోట్లు, సుకుమార్ రూ.25 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోనున్నారట. అంతేకాకుండా సినిమా విడుదల అయిన తర్వాత వచ్చే లాభాల్లో షేర్ కూడా తీసుకోనున్నారని టాక్. ఈ సినిమాకు హై క్వాలిఫైడ్ టెక్నీషియన్లు పనిచేశారు. వారికి కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారు. కాగా పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు.