యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సాంగ్స్  

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ లో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. విడుదలైన మూడు పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన గోదారి గట్టు, మీను, బ్లాక్ బస్టర్ పొంగల్ ట్రాక్స్ యూట్యూబ్, అన్ని మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో మోత మొగిస్తున్నాయి.

బ్లాక్‌బస్టర్‌పొంగల్ సాంగ్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉంటూ పండగ వైబ్ ని రెట్టింపు చేసింది. మీను సాంగ్ 6వ స్థానంలో ఆడియన్స్ అలరిస్తోంది. విడుదలైనప్పటి నుంచి టాప్ ట్రెండింగ్ లో వున్న గోదారిగట్టు సాంగ్10వ స్థానంలో అదరగొడుతోంది.

ఈ మూడు పాటలకు 85 మిలియన్ల వ్యూస్ దాటాయి, ఈ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ పాటలకున్న పాపులారిటీని తెలియజేస్తున్నాయి. సాంగ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ లో ఫ్యాన్స్ డ్యాన్స్ కవర్‌లు, రీల్స్ లో కూడా టాప్ ట్రెండింగ్ లో వున్నాయి.

ఈ మూడు పాటలు 100 మిలియన్ వ్యూస్ కి చేరువయ్యాయి. సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆల్బమ్ ఈ సీజన్‌లో మోస్ట్ సెలబ్రేటెడ్ ఆల్బమ్ గా అదరగొట్టింది.

ఈ మూవీలో వెంకటేష్ ఎక్స్ కాప్ గా, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి నిర్వహిస్తుండగా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్ మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
కో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: రియల్ సతీష్
VFX: నరేంద్ర లోగిసా
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా