ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్టైనర్ను నిర్మిస్తున్నారు.
ఆయ్ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వస్తుంది. టైటిల్ రివీల్ సహా సినిమా కంటెంట్‌కు సంబంధించిన వీడియోలు, పోస్టర్స్, సాంగ్స్ అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో శనివారం మేకర్స్ ఈ మూవీ నుంచి ‘రంగనాయకి’ అనే మాస్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్గా విడుదలైన ఈ సాంగ్ ప్రోమోతో పాటపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా విడుదలైన లిరికల్ సాంగ్ ప్రేక్షకులను మరింతంగా ఆకట్టుకుంటోంది. మాస్ బీట్తో ఉన్న ఈ పాటను వింటుంటే స్టెప్స్ వేయాలనిపించేలా ఉంది.
ప్రస్తుతం సూపర్ హిట్ పాటలకు కేరాఫ్‌గా మారిన రామ్ మిర్యాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందించటం విశేషం. సురేష్ బనిశెట్టి రాసిన ఈ పాటను మోస్ట్ హ్యాపెనింగ్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. భాను మాస్టర్ నృత్య రీతులను సమకూర్చారు. సెట్స్, ఆర్టిస్టుల డ్రెస్సింగ్ చాలా కలర్ఫుల్గా ఉంది. నయన్ సారిక కూడా ఈ పాటలో కనిపించింది.
నితిన్, నయన్ సారిక జోడి సిల్వర్ స్క్రీన్‌పై చూడ చక్కగా ఉంది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనటంలో సందేహం లేదు. ‘ఆయ్’ సినిమాను ప్రారంభం నుంచి సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది టీమ్‌లో మరింత కాన్ఫిడెన్స్‌ను నింపుతోంది. ఈ డిఫరెంట్ ప్రమోషనల్ యాక్టివిటీస్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు: నార్నే నితిన్, నయన్ సారిక తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్ – GA2 పిక్చర్స్
సమర్పణ – అల్లు అరవింద్
నిర్మాతలు – బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
డైరెక్టర్ – అంజి కె.మణిపుత్ర
సహ నిర్మాతలు – భాను ప్రతాప్, రియాజ్ చౌదరి
సినిమాటోగ్రఫీ – సమీర్ కళ్యాణి
సంగీతం – రామ్ మిర్యాల
ఎడిటర్ – కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్ డైరెక్టర్ – కిరణ్ కుమార్ మన్నె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అజయ్ గద్దె
కాస్ట్యూమ్స్ – సుష్మిత, శిల్ప
కో డైరెక్టర్ – రామ నరేష్ నున్న
పి.ఆర్.ఒ – వంశీ కాకా
మార్కెటింగ్ – విష్ణు తేజ్ పుట్ట
పోస్టర్స్ – అనిల్, భాను